Homeబిజినెస్Motorola Signature phone: ప్రీమియం ఫోన్ కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్..

Motorola Signature phone: ప్రీమియం ఫోన్ కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్..

Motorola Signature phone: ప్రీమియం ఫోన్ కోసం ఎదురుచూసేవారు చాలామంది ఉంటారు. ఇలాంటి వారి కోసం ప్రముఖ కంపెనీ Motorola ఆకట్టుకునే మొబైల్ ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. దీనికి సంబంధించిన వివరాలను ఆన్లైన్లో చెప్పడంతో చాలామంది ఈ ఫోన్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన మొబైల్స్ కంటే ఇది హైలెట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఇంతకీ ఈ ఫోన్లో ఉండే విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Motorola త్వరలో మార్కెట్లోకి Signature పేరుతో కొత్త మొబైల్ ను తీసుకువస్తుంది. దీని డిజైన్ చూడడానికి ఆకర్షణయంగా ఉంది. ఈ ఫోన్ పైభాగంలో గొరిల్లా గ్లాస్ తో ప్యాక్ అయి ఉంటుంది. దీనిపై ఎటువంటి నీటి చుక్కలు పడినా కూడా వెంటనే తొలిగిపోయాలా ఉంటుంది. అలాగే ఈ మొబైల్ డిస్ప్లే వెరీ స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో 6.8 అంగుళాల LTPO AMOLED డిస్ప్లేను సెట్ చేశారు. ఇది 165 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఇందులో నేటి యూత్ కు అనుకూలంగా స్నాప్ డ్రాగన్ 8 gen 5 సాఫ్ట్వేర్ ఉండడంతో కావలసిన గేమ్స్, యాప్స్ డౌన్లోడ్ చేసుకుని వినోదం పొందవచ్చు.

నేటి కాలంలో చాలామంది కెమెరా ను దృష్టిలో ఉంచుకొని మొబైల్ కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి వారికి అనుకూలంగా ఉండేందుకు ఈ మొబైల్లో 50 MP మెయిన్ కెమెరాను అమర్చారు. అలాగే 50 MP అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా పనిచేయని ఉంది. ఫ్రంట్ కెమెరా సైతం 50 MP తో పని చేయనుంది. ఈ కెమెరాతో అందమైన దృశ్యాలను ఎలాంటి వాతావరణంలో నైనా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే పగలు రాత్రి అని తేడా లేకుండా కావలసిన ఫోటోగ్రఫీ అందిస్తుంది.

మోటరోలా సిగ్నేచర్ కొత్త మొబైల్ లో బ్యాటరీ పవర్ ఎక్కువే అని చెప్పొచ్చు. ఇందులో 5,200 mAh బ్యాటరీని చేర్చారు. ఇది ఫాస్టెస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో 90 W ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే 50 W వైర్లెస్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 55 నిమిషాల్లోనే 100% చార్జింగ్ అయ్యే విధంగా పనిచేస్తుంది. ఇప్పటివరకు మోటరోలా కంపెనీ నుంచి వచ్చిన మొబైల్స్ కంటే సిగ్నేచర్ లో ఉండే ఫీచర్స్, కెమెరా, బ్యాటరీ పనితీరు మెరుగ్గా ఉండనుందని తెలుస్తోంది. అంతేకాకుండా నేటి తరం యూత్ తో పాటు రోజువారి వినియోగదారులకు అనుగుణంగా ఈ మొబైల్ పనిచేయనుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular