SUV car: SUV కార్ కొనాలని అనుకునేవారు ఎక్కువగా Toyota కంపెనీ వైపు చూస్తుంటారు. ఎందుకంటే కొంతమంది విశాలమైన కారుతోపాటు అవసరాలు తీరడానికి అన్ని ఫీచర్లు ఉండాలని కోరుకుంటారు. ఎస్ యు వి కార్లలో అనేక సౌకర్యాలు ఉంటాయి. అలాగే ఉమ్మడి కుటుంబం కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు అనుగుణంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో టయోటా కంపెనీ లాంగ్ జర్నీ చేసేవారి కోసం కొత్తగా MPV ని ప్రవేశపెట్టింది. ఇది నగరంలో ప్రయాణం చేసే వారితోపాటు లాంగ్ చైన్ చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే లేటెస్ట్ టెక్నాలజీ తో ఉన్న ఈ కారు డీజిల్ ఇంజన్ తో ఉండడంతో మైలేజ్ విషయంలోనూ వినియోగదారులకు ప్లస్ పాయింట్ గా మారనుంది. ఈ కారులో ఉన్న పూర్తి వివరాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం..
Toyota కంపెనీ నుంచి కొత్తగా Innova crysta లేటెస్ట్ అప్డేట్ తో మార్కెట్లోకి వచ్చింది. ఇప్పటికే ఈ వాహనం పరిచయం కాగా ఇప్పుడు నేటి తరం వారికి అనుగుణంగా ఉండేందుకు కొన్ని మార్పులు చేసుకుంది. ఇన్నోవా క్రిస్టా కొత్త కారులో ఎక్స్టీరియర్ డిజైన్ ఆకట్టుకునేలా ఉంది. బోల్డ్ ఫ్రంట్ గ్రిల్, బాడీ లైన్ ప్రీమియం కార్ల వాలే డిజైన్ చేయబడి ఉన్నాయి. స్టైలిష్ తో కూడిన బంపర్లతోపాటు విశాలమైన పొడవు ఉండడంతో బయటి నుంచి చూసేవారికి ఈ కారు పెద్ద వ్యాన్ లా అనిపిస్తుంది. ఇన్నర్ లోను ఈ కారు అద్భుతంగా ఉంది. 7 సీట్లతో లేఅవుట్ ను బాగా సెట్ చేసారు. దీంతో ఇది MPV గా మారి చౌకరివంతాన్ని అందిస్తుంది. అన్ని సీట్ లో ఉన్నవారికి ఎయిర్ కండిషన్ వచ్చేలా ఏర్పాటు చేశారు. దీంతో సుదీర్ఘ ప్రయాణం చేసే వారికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఇన్నోవా క్రిష్టాలో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఒకటికి మించి చార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. దీంతో ఇందులోని ప్రయాణికులకు చార్జింగ్ అవసరం ఉంటే వెంటనే ఉండే అవకాశం ఉంది.
ఈ కారులో సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ తో పాటు EBD తో కూడిన ABS టెక్నాలజీ సేఫ్టీని ఇస్తాయి. నగరాల్లో ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి అలజడి లేకుండా బ్రేకింగ్ సిస్టంను సెట్ చేశారు. ఈ వెహికల్ డీజిల్ ఇంజన్ ను కలిగి ఉంది. ఇది లీడర్ ఇంధనానికి 18 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుంది. ఉమ్మడి కుటుంబం అంతా కలిసి దూర ప్రయాణం చేసినప్పుడు ప్రయాణికులకు అనుకూలంగా ఉండనుంది.