https://oktelugu.com/

పెన్షనర్లకు శుభవార్త.. ఆన్‌లైన్‌లో సులువుగా లైఫ్ సర్టిఫికేట్‌ పొందే ఛాన్స్!

పెన్షన్‌దారులు ప్రతి సంవత్సరం పెన్షన్ ను మంజూరు చేసే సంస్థలకు పెన్షన్ సర్టిఫికెట్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లైఫ్ సర్టిఫికెట్ ద్వారా బ్యాంకులు, పోస్టాఫీసులకు తాము జీవించే ఉన్నామని ఋజువు చేసే అవకాశం అయితే ఉంటుంది. నవంబర్ నెల 30వ తేదీలోపు ఈ సర్టిఫికెట్ ను అందించడం ద్వారా సులభంగా పెన్షన్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే 70 సంవత్సరాల కంటే వయస్సు పైబడిన వారు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 28, 2021 / 10:43 AM IST
    Follow us on

    పెన్షన్‌దారులు ప్రతి సంవత్సరం పెన్షన్ ను మంజూరు చేసే సంస్థలకు పెన్షన్ సర్టిఫికెట్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లైఫ్ సర్టిఫికెట్ ద్వారా బ్యాంకులు, పోస్టాఫీసులకు తాము జీవించే ఉన్నామని ఋజువు చేసే అవకాశం అయితే ఉంటుంది. నవంబర్ నెల 30వ తేదీలోపు ఈ సర్టిఫికెట్ ను అందించడం ద్వారా సులభంగా పెన్షన్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.

    అయితే 70 సంవత్సరాల కంటే వయస్సు పైబడిన వారు కార్యాలయాలకు వెళ్లి పెన్షన్ సర్టిఫికెట్ ను అందించడం సాధ్యం కాదు. కరోనా వైరస్ వృద్ధులపై ఎక్కువగా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో వృద్ధులు మరిన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉందని చెప్పవచ్చు. జీవన్ ప్రమాణ్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ లేదా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ద్వారా సులువుగా లైఫ్ సర్టిఫికెట్ ను పొందే ఛాన్స్ ఉంటుంది.

    ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ఆన్ లైన్ లో స్టోర్ అవుతుందని చెప్పవచ్చు. పెన్షనర్ ఆధార్ నంబర్ తో పాటు మొబైల్ నంబర్ ను కలిగి ఉండటంతో పాటు ప్రభుత్వ జీవన్ ప్రమాణ్ పోర్టల్‌ లో తప్పనిసరిగా రిజిష్టర్ చేసుకోవాలి. పెన్షనర్ వెబ్ సైట్ లో జీవన్ ప్రమాణ్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ ను డౌన్ లోడ్ చేసుకోవడంతో పాటు పూర్తి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

    లాగిన్ అయిన తర్వాత జనరేట్ జీవన్ ప్రమాణ్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయడం ద్వారా ఆధార్ నంబర్ తో పాటు మొబైల్ నంబర్ ను నమోదు చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి వివరాలను ఎంటర్ చేయాలి. ధృవీకరణ పూర్తైన తర్వాత మొబైల్ స్క్రీన్ పై జీవన్ ప్రమాణ్ ప్రింట్ కాపీని చూడటంతో పాటు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ను సులభంగా సబ్మిట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది.