https://oktelugu.com/

Smoking: ధూమపానం వల్ల ఊపిరితిత్తులు ఎలా ఎఫెక్ట్ అవుతాయో తెలుసా? ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి?

సిగరెట్లు, సిగార్లు, వేప్‌లు, బీడీలు, హుక్కా వంటి వివిధ రూపాల్లో పొగాకు సేవించడం వల్ల ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతింటాయి. ఊపిరితిత్తులు వ్యాధులు వస్తాయి కాబట్టి ఈ పొగాకుకు దూరంగా ఉండాలి అంటారు నిపుణులు. అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD). ఇది కూడా దీర్ఘకాలిక శోథ ఊపిరితిత్తుల వ్యాధి. ఇది ఊపిరితిత్తుల నుంచి గాలి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. శ్వాస సమస్యలను ప్రేరేపిస్తుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : July 19, 2024 / 12:15 PM IST

    Smoking

    Follow us on

    Smoking: ధూమపానం చాలా మంది ఆరోగ్యాలను నాశనం చేస్తుంది. తెలిసి కూడా ధూమపానం, మద్యపానం మానేయడం లేదు చాలామంది. మీరు కూడా వీటికి అడిక్ట్ అయ్యారా? ఇక ధూమపానం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. అంతేకాదు మీరు ధూమపానం చేయడం వల్ల మీకు మాత్రమే కాదు మీ పక్కన ఉన్నవారికి కూడా నష్టమే. మరి పొగాకు వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయి. ఎలాంటి వ్యాధులు వస్తాయి. వాటి సంకేతాలు ఏంటి? ఎలా నివారించాలి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

    సిగరెట్లు, సిగార్లు, వేప్‌లు, బీడీలు, హుక్కా వంటి వివిధ రూపాల్లో పొగాకు సేవించడం వల్ల ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతింటాయి. ఊపిరితిత్తులు వ్యాధులు వస్తాయి కాబట్టి ఈ పొగాకుకు దూరంగా ఉండాలి అంటారు నిపుణులు. అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD). ఇది కూడా దీర్ఘకాలిక శోథ ఊపిరితిత్తుల వ్యాధి. ఇది ఊపిరితిత్తుల నుంచి గాలి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. శ్వాస సమస్యలను ప్రేరేపిస్తుంది.

    COPD నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్, బెంజీన్, ఆర్సెనిక్ వంటి హానికరమైన రసాయనాలతో కూడిన పొగాకును పీల్చడం వల్ల వస్తుంది అంటున్నారు నిపుణులు. ఫార్మల్ డీహైడ్, రేడియోధార్మిక పదార్థాలు ఊపిరితిత్తులను వాయుమార్గాలను మరింత దెబ్బతీస్తాయి. పొగాకు నమలడం వల్ల నోటి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఫలితంగా అన్నవాహిక సమస్యలు, కడుపు సంబంధిత వ్యాధులు వస్తాయి.

    ధూమపానం వల్ల వచ్చే సమస్యలు:
    నికోటిన్ ఊపిరితిత్తులు దెబ్బతినడానికి ప్రధాన కారణం కావచ్చు అనుకుంటారు. కానీ కచ్చితంగా ఊపిరితిత్తులకు ముప్పును కలిగిస్తుంది. ధూమపానం శ్వాసనాళంలో మార్పులకు కారణమవుతుంది. అయితే సాధారణంగా సన్నగా ఉండే స్రావాలు మందంగా మారడం వల్ల సిలియాకు పునరావృత నష్టం జరుగుతుంది అంటున్నారు నిపుణులు.ఇంతకీ ఈ సిలియా అంటే ఏంటి అనుకుంటున్నారా? సిలియా శరీరాన్ని వ్యాధి బారిన పడకుండా కాపాడుతుంది. ఊపిరితిత్తుల నుంచి ధూళి కణాలను తొలగిస్తుంది. అధిక ధూమపానం అల్వియోలీకి (ప్రాథమిక శ్వాసకోశ చర్యలను నియంత్రించే చిన్న గాలి నాళాలు) కోలుకోకుండా చేస్తుంది. ఒకసారి అవి దెబ్బతింటే తిరిగి కోలుకోవడం కష్టమే. మరి ఈ COPD లక్షణాలు ఏంటో కూడా తెలుసుకుందాం.

    ప్రారంభ సంకేతాలు: కొన్ని వారాల కంటే ఎక్కువగా దగ్గు వస్తుంటుంది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ముఖ్యంగా నడిచినా లేదా మెట్లు ఎక్కినా, ఛాతిలో నొప్పి, ఆయాసం అధికంగా వస్తుంటుంది. వాతావరణం లేదా పరిసరాలతో సంబంధం లేకుండా అధిక చెమట వస్తుంది. సాధారణ జలుబు, సైనసిటిస్, ఎపిగ్లోటిటిస్, బ్రోన్కైటిస్, టాన్సిలిటిస్ వంటి తరచుగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. తరచుగా ఉదయం లేవగానే విపరీతమైన తలనొప్పితో మెలకువ వస్తుంది. తినాలనే కోరిక ఉన్నా ఆకలి మాత్రం ఉండదు. ఫలితంగా ఆరోగ్యం క్షీణిస్తుంది. అనుకోకుండా బరువు తగ్గడం, సులభంగా అలసిపోవడం, శక్తి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.

    మార్చాలనే సంకల్పం: ధూమపానం మానేయాలనే సంకల్పం ఉంటే చాలు సగం యుద్ధం గెలిచినట్టే. ఊపిరితిత్తుల వ్యాధులు, COPD ప్రభావాన్ని తగ్గించడానికి మీరు ధూమపానానికి దూరంగా ఉండాలి. ముందుగా దీన్ని మానేయడం వల్ల మీ ఊపిరితిత్తులు నయం అవుతాయి. అంతేకాదు మీ పాడైన ఆరోగ్యం తిరిగి పుంజుకుంటుంది. ధూమపానం ఊపిరితిత్తులను ఎలా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందో, COPDకి ఎలా దారితీస్తుందో అర్థం చేసుకోవడం వల్ల ధూమపానానికి దూరంగా ఉండాలని నిశ్చియించుకుంటారు. అందుకే వీటి వల్ల జరిగే నష్టాలను ముందుగా తెలుసుకోవాలి. అంతేకాదు ధూమపానం చేసి మీకు అలవాటు అయితే నోట్లో కొన్ని సార్లు ఆ సమయానికి ఏదైనా ఉండాలి అనిపిస్తుంది. వీటికి ప్రత్యామ్నాయంగా మీ ఆరోగ్యానికి మంచి చేసేవి అలవాటు చేసుకోండి.