https://oktelugu.com/

ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న వేతనాలు..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాన్ని భారీగా పెంచనుందని తెలుస్తోంది. ఏడవ వేతన సంఘం సిఫారసుల మేరకు ఉద్యోగుల వేతనం పెరగనుందని సమాచారం. కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు జులై 1వ తేదీ నుంచి పెరిగిన వేతనం చెల్లించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నాయి. డీఏ , డీఆర్ అలవెన్సులను కూడా కేంద్రం జులై 1 నుంచే చెల్లించే అవకాశాలు అయితే ఉన్నాయి. అధికార వర్గాలు వెల్లడిస్తున్న వివరాల ప్రకారం డీఏ 28 […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : June 11, 2021 4:11 pm
    Follow us on

    govt employees salary

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాన్ని భారీగా పెంచనుందని తెలుస్తోంది. ఏడవ వేతన సంఘం సిఫారసుల మేరకు ఉద్యోగుల వేతనం పెరగనుందని సమాచారం. కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు జులై 1వ తేదీ నుంచి పెరిగిన వేతనం చెల్లించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నాయి. డీఏ , డీఆర్ అలవెన్సులను కూడా కేంద్రం జులై 1 నుంచే చెల్లించే అవకాశాలు అయితే ఉన్నాయి.

    అధికార వర్గాలు వెల్లడిస్తున్న వివరాల ప్రకారం డీఏ 28 శాతానికి చేరుకోనుందని తెలుస్తోంది. జూన్ నెల 30వ తేదీన ఇందుకు సంబంధించిన కాస్ట్ ఇండెక్షేషన్‌ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇండెక్షేషన్ తరువాతే డీఏ పెరుగుదల అమల్లోకి వస్తుందనే సంగతి తెలిసిందే. 2019 జూలై నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 17 శాతం డీఏ వస్తుండగా కరోనా మహమ్మారి వల్ల డీఏ పెంపుపై నిర్ణయాన్ని కేంద్రం వాయిదా వేసింది.

    జనవరి 1, జూలై 1, ఈ సంవత్సరం జనవరి 1న చెల్లించాల్సిన డీఏలను కేంద్రం నిలుపుదల చేయడం గమనార్హం. లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డీఏ పెంపు కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మహమ్మారి వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచితే 1.1 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది.

    కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉద్యోగులకు భారీ మొతంలో లబ్ధి చేకూరనుండటం గమనార్హం.