పుట్టినరోజు సందర్భంగా నందమూరి బాలయ్య తన బావ చంద్రబాబును ఇరుకునపెట్టేశాడు. టీడీపీ అధ్యక్ష పదవికి తాను అర్హుడను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు, లోకేష్ లను తెగ ఇబ్బంది పెట్టాయనే చెప్పాలి. హాట్ కామెంట్స్ తో బాలయ్య బాబు టీడీపీలో కలకలం రేపాడనే చెప్పొచ్చు.
టీడీపీ అధ్యక్ష పదవిపై నటుడు, ఎమ్మెల్యే ఓపెన్ అయ్యాడు. తానొక రగులుతున్న అగ్నిపర్వతం అని.. అది ఎప్పటికైనా బద్దలవుతుందంటూ పరోక్షంగా టీడీపీ అధ్యక్ష పదవి తనకే వస్తుందన్న సంకేతాలను బావ చంద్రబాబుకు పంపాడు.
తాజాగా బాలయ్య పుట్టినరోజు సందర్భంగా తెలుగు టాప్ న్యూస్ చానెల్ బాలయ్యను ఇరికించేసింది. ఆయన ఎంత మాట్లాడకుండా ఉందామనుకున్నా కూడా ప్రశ్నలు వేసి రెచ్చగొట్టి మరీ రచ్చ చేసింది. దీంతో బాలయ్య టీడీపీ అధ్యక్ష బాధ్యతలకు తాను 100శాతం అర్హుడిని అంటూ స్పష్టం చేశారు. కానీ నేను అడగను.. ఇప్పటివరకు అడగలేదని వివరణ ఇచ్చారు.
మనకి చాలా టైమ్ ఉందని.. ప్రస్తుతానికి వెయిటింగ్ లో ఉన్నానని.. వేచిచూడ్డం అనేది రకరకాలుగా మలుపులు తీసుకుంటుందని బాలక్రిష్ణ చెప్పాడు. బహుశా నా వేచి చూడడం అనే ధోరణి ఒక్కసారిగా సముద్రంలో ఉన్న అగ్నిపర్వతంలా విస్ఫోటనం అవుతుందేమోనని టీడీపీ అధ్యక్ష పదవిపై బాలక్రిష్ణ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇక తన కంటే అల్లుడు లోకేష్ బెటర్ అని.. అల్లుడు పోటీలోకి వస్తే మాత్రం తప్పుకుంటానని.. చాలా తెలివిగల తండ్రికి తగ్గ తనయుడు రాజకీయ, పాలన వ్యవహారాల్లో మెరుగైన లోకేష్ కు పగ్గాలు ఇవ్వాల్సి వస్తే తనకంటే బెటర్ అని బాలయ్య చెప్పుకొచ్చాడు. లోకేష్ అల్లాటప్ప వ్యక్తం కాదంటూ వివరణ ఇచ్చాడు.