https://oktelugu.com/

ఎల్‌ఐసీ అదిరిపోయే పాలసీ.. ప్రతి నెలా ఖాతాలోకి రూ.6 వేలు..?

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ పాలసీని కచ్చితంగా కలిగి ఉంటే మంచిది. దేశీ దిగ్గజ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని భావించే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రతి నెలా చేతికి డబ్బులు వస్తే బాగుంటుందని అనుకునే వాళ్ల కోసం అదిరిపోయే పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఎల్‌ఐసీ జీవన్ అక్షయ పాలసీ ద్వారా కస్టమర్లకు భారీగా ప్రయోజనం చేకూరనుంది. 30 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాల మధ్య […]

Written By: , Updated On : June 11, 2021 / 12:01 PM IST
Follow us on

Lic Jeevan Akshaya

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ పాలసీని కచ్చితంగా కలిగి ఉంటే మంచిది. దేశీ దిగ్గజ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని భావించే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రతి నెలా చేతికి డబ్బులు వస్తే బాగుంటుందని అనుకునే వాళ్ల కోసం అదిరిపోయే పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఎల్‌ఐసీ జీవన్ అక్షయ పాలసీ ద్వారా కస్టమర్లకు భారీగా ప్రయోజనం చేకూరనుంది.

30 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకునే అవకాశం ఉంటుంది. రూ.లక్ష నుంచి ఇన్వెస్ట్‌ చేసే అవకాశం ఉండగా గరిష్ట పరిమితి లేకపోవడం వల్ల ఎంత మొత్తమైనా ఇన్వెస్ట్ చేసి పెన్షన్ ను పొందే అవకాశాలు ఉంటాయి. పాలసీదారులకు 10 రకాల పెన్షన్ ఆప్షన్లు అందుబాటులో ఉండగా నచ్చిన ఆప్షన్ ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. సంవత్సరానికి కనీసం 12,000 రూపాయల పెన్షన్ ను ఈ పాలసీ ద్వారా తీసుకోవచ్చు.

65 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు 9 లక్షల మొత్తానికి పాలసీ తీసుకుంటే నెలకు రూ.6,300 చొప్పున సంవత్సరానికి ఏకంగా 80వేల రూపాయలు వస్తాయి. జీవితాంతం పెన్షన్ ను పొందే అవకాశం ఉండటం వల్ల ఈ పాలసీ వల్ల ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఎల్‌ఐసీ ఆఫర్ చేస్తున్న పాలసీలలో ఒకటైన జీవన్ అక్షయ పాలసీ ఎక్కువ డిమాండ్ ఉన్న పాలసీలలో ఒకటని చెప్పవచ్చు.

లైఫ్ లాంగ్ పెన్షన్ పొందే అవకాశం ఉండటంతో తక్కువ వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీలో చేరితే ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎల్‌ఐసీ ఏజెంట్ లేదా ఎల్‌ఐసీ బ్రాంచ్ ను సంప్రదించి పాలసీకి సంబంధించి సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు.