https://oktelugu.com/

బీటెక్ చదువుతున్న విద్యార్థులకు శుభవార్త.. రూ.74 వేల స్కాలర్ షిప్ తో?

దేశంలో ఇంజనీరింగ్ చదివే విద్యార్థుల సంఖ్య లక్షల్లో ఉంది. ప్రస్తుతం బీటెక్ చదువుతున్న వాళ్లలో ఎక్కువమంది కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ను ఎంపిక చేసుకున్నారు. అయితే సీఎస్సీ బ్రాంచ్ లో కెరీర్ ను ఎంపిక చేసుకున్న వాళ్లకు గూగుల్ అదిరిపోయే శుభవార్తను అందించింది. కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులకు గూగుల్ స్కాలర్ షిప్ ను అందిస్తోంది. బీటెక్ చదువుతున్న విద్యార్థులు స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ స్కాలర్ షిప్ కు అర్హత పొందవచ్చు. యువకులతో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 7, 2021 / 03:29 PM IST
    Follow us on

    దేశంలో ఇంజనీరింగ్ చదివే విద్యార్థుల సంఖ్య లక్షల్లో ఉంది. ప్రస్తుతం బీటెక్ చదువుతున్న వాళ్లలో ఎక్కువమంది కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ను ఎంపిక చేసుకున్నారు. అయితే సీఎస్సీ బ్రాంచ్ లో కెరీర్ ను ఎంపిక చేసుకున్న వాళ్లకు గూగుల్ అదిరిపోయే శుభవార్తను అందించింది. కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులకు గూగుల్ స్కాలర్ షిప్ ను అందిస్తోంది. బీటెక్ చదువుతున్న విద్యార్థులు స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ స్కాలర్ షిప్ కు అర్హత పొందవచ్చు.

    యువకులతో పాటు యువతులకు కూడా గూగుల్ ఈ స్కాలర్ షిప్ ను అందజేస్తుండటం గమనార్హం. ఎవరైతే ఈ స్కాలర్ షిప్ కు ఎంపికవుతారో వాళ్లకు గూగుల్ 1,000 డాలర్లను ప్రధానం చేసే అవకాశం ఉంటుంది. మన దేశ కరెన్సీ విలువ ప్రకారం 74,760 రూపాయలు గూగుల్ ద్వారా స్కాలర్ షిప్ రూపంలో పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2021 – 2022 విద్యా సంవత్సరంలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫుల్ టైమ్ చదువుతున్న వాళ్లు ఈ స్కాలర్ షిప్ కు అర్హులు.

    ఆసియా పసిఫిక్ దేశంలోని గుర్తింపు పొందిన యూనివర్సిటీలలో చదువుతున్న విద్యార్థులు సైతం ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, సంబంధిత టెక్నికల్ ఫీల్డ్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అకడమిక్ రికార్డు కలిగి ఉన్నవాళ్లు ఇంగ్లీష్‌లో ఒక వ్యాసం రాసి ఇందుకోసం పంపాల్సి ఉంటుంది.

    https://buildyourfuture.withgoogle.com/scholarships/generation-google-scholarship-apac/ వెబ్ సైట్ ద్వారా ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిభ ఉన్న యువతీయువకులకు ఈ స్కాలర్ షిప్ ద్వారా ప్రయోజనం చేకురూతుంది.