Homeఎంటర్టైన్మెంట్Pushpa Movie: అల్లు అర్జున్ "పుష్ప" సినిమా హిందీ రిలీజ్ కష్టమేనా...

Pushpa Movie: అల్లు అర్జున్ “పుష్ప” సినిమా హిందీ రిలీజ్ కష్టమేనా…

Pushpa Movie: మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై డైరెక్ట‌ర్ సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం “పుష్ప”. ఈ సినిమాలో ఐకన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్నారు. పాన్‌ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రి వర్గాల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. అలానే మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్నారు. ఆర్య, ఆర్య 2 తర్వాత  వీరిద్దరు కలిసి ఈ మూవీ తెరకెక్కిస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

allu arjun pushpa movie facing some issues about hindi release

ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావోచ్చింది. ఈ సినిమా డిసెంబర్ 17 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే  ఇప్పుడు ఈ సినిమాకు ఓ విషయంలో చిక్కోచ్చి పడింది. ఈ సినిమా హిందీ వెర్షన్ థియేటర్‌లో విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే డైరక్ట్ గా రిలీజ్​ అవుతుందని… హిందీలో మాత్రం థియేటర్ రిలీజ్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అనుకుంటున్నారు.

పుష్ప సినిమాని పాన్ ఇండియా చిత్రంగా అనుకోక‌ ముందు తెలుగు,మలయాళంలో విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది అని సమాచారం. దీంతో చిత్రం షూటింగ్‌ను ప్రారంభించక ముందే అల్లు అర్జున్‌ సినిమాలకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కుల్ని ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కు అమ్మేసారని టాక్ వినిపిస్తుంది. అయితే ఆ తర్వాత ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలని భావించి అందుకు తగ్గట్లు గానే ప్రమోషన్స్ కూడా చేశారు. ఈ మేరకు సినిమాలోని అన్నీ అప్డేట్ లను  తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. ఓ పాటను కూడా హిందీలో విడుదల చేశారు.

కానీ తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన హిందీ డబ్బింగ్ రైట్స్ కొన్న వ్యక్తి థియేటర్‌లో ఎలా విడుదల చేస్తారని అడ్డం తిరిగినట్లు తెలుస్తుంది. దీంతో చిత్రబృందానికి ఏమి చేయాలో తెలియక అయోమయోలో పడ్డారని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. తాజాగా విడుదలైన సునీల్ పోస్టర్‌ ను  హిందీ భాషలో తప్ప మిగిలిన భాషల్లో విడుదల చేయడం గమనార్హం. మరి ఈ విషయంపై అధికారిక ప్రకటన వచె వరకు ఈ విషయంలో క్లారిటీ రాదని చెప్పాలి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version