Bajaj CNG Bike: పెట్రోల్ ఫ్యూయెల్ కు ప్రత్యామ్నాయంగా ఇప్పటి వరకు CNG కార్లను చూశాం.. వాటి పనితీరు తెలుసుకున్నాం.. కానీ ఇప్పుడు బైక్ లు కూడా ఇదే వేరియంట్ లో రాబోతున్నాయి. అత్యధిక మైలేజ్, తక్కువ ధరతో కూడిన బైక్ లను వినియోగదారులకు అందించాలని బజాజ్ కంపెనీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇథనాల్ ఆధారంగా నడిచే బైక్ లను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభమై మధ్య దశలోకి వచ్చింది. ఈ క్రమంలో బైక్ గురించి వివరాలు ఆన్ల్లైన్ లో బయటపెట్టడంతో కస్టమర్లు ఇంప్రెస్ అవుతున్నారు.
దేశీయ ఆటోమోబైల్ రంగంలో బజాజ్ కంపెనీ వివిధ రకాల బైక్ లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వినియోగదారులకు తక్కువ ధరకు, అత్యధిక మైలేజ్ ఇచ్చే వాహనాలు ఈ కంపెనీ నుంచి ఇప్పటి వరకు చాలానే వచ్చాయి. అయితే తాజాగా పెట్రోల్ కు ప్రత్యామ్నాయంగా సీఎన్జీ బైక్ లను ఉత్పత్తి చేస్తుంది. బ్రూజర్ E101 అనే కోడ్ నేముతో సీఎన్ జీ కమ్ పెట్రోల్ ఫ్యూయెల్ కలిగిన ఈ బైక్ 110 సీసీగా రూపొందించారు. దీనికి సంబంధించిన నమూనాలను రిలీజ్ చేసింది.
2024లో దీనిని ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు దీనిని మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ఉత్తరాఖండ్ లోని పంత్ నగర్ లో ఉత్పత్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. బజాజ్ నుంచి గతంలో వచ్చిన ప్లాటినం ను మార్చి సీఎన్ జీగా మార్చారు. దేశంలో సీఎన్ జీ వాహనాలపై జీఎస్ టీని 18 శాతం తగ్గించాలని నిర్ణించిన నేపథ్యంలో ఈ బైక్ ను వృద్ధి చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. మార్కెట్లో బజాజ్ కంపెనీ ఇప్పటికే 30 వాతం బైక్ లను కలిగి ఉంది. ఇప్పుడు సీఎన్ జీ లోనూ అత్యధిక వాటాను కలిగే అవకాశం ఉందని అంటున్నారు.
ఇప్పటి వరకైతే బజాజ్ ప్లాటినం 89,792తో విక్రయిస్తున్నారు. ఇది 7.79 బిహెచ్ పీ పవర్ ను అందిస్తుంది. 8.34 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 4 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కలిగిన ఇది సీఎన్ జీలో బయటకు వచ్చిన తరువాత తక్కువ ధరకే వినియోగదారులకు అందించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. రానున్న కాలంలో సీఎన్ జీలదే హవా సాగుతుందని, ఈ విషయంలో బజాజ్ ముందుంటుందని చెబుతున్నారు.