Gold Price Today: శుభకార్యాలు జరుగుతున్న వేళ బంగారం ధరలు గుడ్ న్యూస్ చెప్పాయి. అంతర్జాతీయం బంగారం ధరలు స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2026 డాలర్లు నమోదైంది. సిల్వర్ ఔన్స్ కు 22.79 డాలర్ల ట్రేడ్ అవుతోంది. 2024 ఫిబ్రవరి 23వ తేదీన ధరలు ఎలా ఉన్నాయంటే?
బులియన్ మార్కెట్ ప్రకారం.. ఫిబ్రవరి 23న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,500గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,730 గా ఉంది. ఫిబ్రవరి 22న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,600తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి గురువారం కంటే శుక్రవారం రూ.100 కు పైగా తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,640 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,870గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,500 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.62,730 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,990 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,220తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,500 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,730తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,500తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,730తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలతో పాటు వెండి ధరలు తగ్గాయి. శుక్రవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.74,900గా నమోదైంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం వెండి ధరలు రూ.100 తగ్గింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.74,900గా ఉంది. ముంబైలో రూ..74,900, చెన్నైలో రూ.76,400, బెంగుళూరులో 72,300, హైదరాబాద్ లో రూ.76,400తో విక్రయిస్తున్నారు.