Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 ఫిబ్రవరి 23న ద్వాదశ రాశులపై అశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. శుక్రవారం చంద్రుడు సింహా రాశిలో సంచరించనున్నాడు. దీంతో ఓ రాశి వారు ఇతరులకు డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ. మరి కొన్ని రాశివారు కొత్త వస్తువులు కొనుగోలు పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
కుటుం సభ్యులతో సమయం వెచ్చిస్తారు.మనసులో ఎటువంటి చెడు ఆలోచనలను రానీయకుండా ఉండాలి. వ్యాపారులకు పెట్టుబడులు అనుకూలం. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు.
వృషభ రాశి:
గతంలో మొదలుపెట్టిన పనిని పూర్తి చేయడానికి కష్టపడుతారు.వినోదం కోసం ఖర్చులు పెడుతారు. మానసికంగా ఉల్లాసంగ ఉంటారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.
మిధునం:
ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. పాత స్నేహితులను కలుస్తారు. వ్యాపారులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.
కర్కాటకం:
ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేసే టప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారులకు లాభాలు ఉంటాయి.
సింహ:
ఈరోజు ఈ రాశివారు ఎవరికీ డబ్బు అప్పుుగా ఇవ్వొద్దు. గతంలో అనుకున్న కోరిక నెరవేరుతుంది. మనసులో ఎటువంటి ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉండాలి.
కన్య:
కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులకు వాగ్దానాలు ఇస్తారు. అయితే వాటిని నెరవేర్చడానికి ప్రయత్నించాలి.
తుల:
కొన్ని వృథా ఖర్చులు ఉండొచ్చు. ప్రత్యర్తులు మీపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తారు. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించాలి. ఉద్యోగులకు సీనియర్లతో సంయమనం ఉంటుంది.
వృశ్చికం:
ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలు చేస్తారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
ధనస్సు:
వ్యాపారులు సలహాలు ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. ఇతరుల పనుల విషయంలో జోక్యం చేసుకోకూడదు. పిల్లల ప్రవర్తన పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
మకర:
వ్యాపారానికి సంబంధించిన విహారయాత్ర ఉంటుంది. ఏదైనా ఒత్తిడికి గురైతే వెంటనే ఉపశమనం పొందాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలి.
కుంభం:
ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. సీనియర్లు ఉద్యోగులతో ఉల్లాసంగా ఉంటారు. ఎవరినైనా డబ్బు అడిగితే తక్షణ సాయం అందుతుంది.
మీనం:
జీవిత భాగస్వామి ఆరోగ్యంపై పట్ల శ్రద్ధ వహించాలి. కొన్ని ప్రణాళికలు దెబ్బతినే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులను దరిచేరనీయొద్దు. కొన్ని పనుల్లో బిజీగా గడుపుతారు.