Homeబిజినెస్Gold Rates Today : పండుగ పూట బెంబేలెత్తించిన బంగారం ధరలు..

Gold Rates Today : పండుగ పూట బెంబేలెత్తించిన బంగారం ధరలు..

Gold Price Today: మహాశివరాత్రి పండుగ సందర్భంగా బంగారం ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. మూడు రోజులుగా వరుసగా పెరిగి 22 క్యారెట్ల బంగారం ధరలు 60 వేలకు పైకి ఎగబాకాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2159 డాలర్లుగా నమోదైంది. సిల్వర్ ఔన్స్ కు 24.35 డాలర్ల ట్రేడ్ అవుతోంది. 2024 మార్చి 8వ తేదీన ధరలు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. మార్చి 8న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,100గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.65,710 గా ఉంది. మార్చి7న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.59,700తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి గురువారంతో పోలిస్తే శుక్రవారం రూ.400 మేర పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,260 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.65,720గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,110 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.65,570 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.60,910 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.66,410తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.60.110 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.65,570తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.60,110తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.65,570తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలతో పాటు వెండి ధరలు పెరిగాయి. శుక్రవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.78,500గా నమోదైంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం రూ.500 పెరిగింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.75,100గా ఉంది. ముంబైలో రూ..75,100, చెన్నైలో రూ.78,600, బెంగుళూరులో 74,200, హైదరాబాద్ లో రూ.78,600తో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Oktelugu Epaper
Exit mobile version