Gudivada Amarnath: గుడివాడ అమర్నాథ్ కు షాక్.. పరిస్థితి ఏంటంటే?

గత ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ సీటును గుడివాడ అమర్నాథ్ కు కేటాయించారు.అక్కడి నుంచి అమర్నాథ్ గెలుపొందారు.పార్టీ వాయిస్ ను గట్టిగా వినిపించ గలిగారు. అధినేతను ఆకట్టుకోగలిగారు.

Written By: Dharma, Updated On : March 8, 2024 8:49 am

Gudivada Amarnath

Follow us on

Gudivada Amarnath: మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆశలు వదులుకోవాల్సిందేనా? ఆయనకు టికెట్ లేనట్టేనా? ఆయన త్యాగం చేయాల్సిందేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జగన్ సైతం ఇదే తరహా ప్రకటన చేయడంతో గుడివాడ అమర్నాథ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం డౌటే నని తేలుతోంది. అనకాపల్లి పర్యటనకు వచ్చిన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమర్నాథ్ తన మనిషని చెబుతూనే.. భవిష్యత్తులో అతడికి మంచి జరుగుతుందని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు కాదని అర్థం వచ్చేలా మాట్లాడారు. దీంతో అమర్నాథ్ కు ఫుల్ క్లారిటీ వచ్చింది.

గత ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ సీటును గుడివాడ అమర్నాథ్ కు కేటాయించారు.అక్కడి నుంచి అమర్నాథ్ గెలుపొందారు.పార్టీ వాయిస్ ను గట్టిగా వినిపించ గలిగారు. అధినేతను ఆకట్టుకోగలిగారు. అందుకే మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్నారు. మంత్రివర్గంలో సైతం యాక్టివ్ గా పని చేస్తూ పోతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఖాయమని నమ్మకం పెట్టుకున్నారు. కానీ జగన్ ఆయన ఆశలను చిదిమేశారు. అనకాపల్లి అసెంబ్లీ సీటు లేదని తేల్చి చెప్పారు. ఆ స్థానంలో మలసాల భరత్ అనే యువకుడికి నియమించారు. అయిష్టతతోనే అమర్నాథ్ ఈ నిర్ణయానికి ఒప్పుకున్నారు. ఎక్కడైనా అవకాశం ఇవ్వకపోతారా అని భావించారు. అయితే తాజాగా జగన్ మాటలు చూస్తుంటే ఇక ఈ ఎన్నికల్లో అమర్నాథ్ కు టికెట్ లేనట్టే.

చేయూత పథకం బటన్ నొక్కేందుకు సీఎం జగన్ అనకాపల్లి వచ్చారు. కానీ అమర్నాథ్ కు టికెట్ విషయంలో ఎటువంటి ప్రకటన చేయలేదు. పైగా కీలక కామెంట్లు చేశారు. కుడి ఎడమ నా తమ్ముళ్లు అమర్నాథ్,భరత్ ఉన్నారు అంటూ సంబోధించారు. అమర్నాథ్ కు భవిష్యత్తులో చాలా మంచి జరుగుతుంది. నా గుండెల్లో పెట్టుకుంటాను. భరత్ పోటీ చేస్తున్నాడు ఆశీర్వదించండి అని విజ్ఞప్తి చేశారు. ఆ సమయంలో అమర్నాథ్ ముఖంలో రకరకాల ఎక్స్ప్రెషన్స్ కనిపించాయి. తన సీటు గురించి ఏమైనా ప్రకటిస్తారన్న ఆత్రుత కనిపించింది. కానీ జగన్ నోటి నుంచి ఒక్క సానుకూల ప్రకటన రాకపోవడంతో అమర్నాథ్ నిరాశకు గురయ్యారు.

అనకాపల్లి నుంచి తప్పించిన అమర్నాథ్ కు చోడవరం,ఎలమంచిలి లో ఏదో ఒక నియోజకవర్గాన్ని కేటాయిస్తారని ప్రచారం జరిగింది.సామాజిక సమీకరణలో భాగంగా పెందుర్తి సీటు అయిన ఇస్తారని భావించారు. కానీ వైవి సుబ్బారెడ్డి అడ్డు తగిలినట్లు తెలుస్తోంది. దీంతో పెందుర్తిలో సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజును కొనసాగిస్తారని సమాచారం. ప్రస్తుతానికి అమర్నాథ్ కు ఎక్కడా చాన్స్ లేదని సమాచారం. అందుకే జగన్ భవిష్యత్తుకు భరోసా కల్పించారు కానీ.. ప్రస్తుతానికైతే లేదని సంకేతాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఎన్నికల ముంగిటయినా అమర్నాథ్ కు ఉపశమనం దక్కుతుందో? లేదో? చూడాలి.