Today Gold Price : 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛత ముఖ్యంగా ప్రీమియం కొనుగోలుదారుల తొలి ఎంపికగా ఉంటుంది. 22 క్యారెట్ల బంగారాన్ని బలమైనదిగా అలాగే ఆభరణాలకు చాలా ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, పెరుగుతున్న మార్కెట్ ధరలు, ప్రభుత్వ పన్నులు మరియు రూపాయి విలువలో హెచ్చుతగ్గులు కారణంగా మన దేశంలో కూడా బంగారం ధరలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. అయితే ఈరోజు బంగారం ధరలో మళ్లీ పెరిగినట్లు తెలుస్తున్నాయి. గతంలో ఒక తులం బంగారం లక్ష రూపాయలకు పైగా చేరుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కొంచెం కొంచెంగా దిగి వచ్చినా బంగారం ధరలు 95 వేలకు చేరుకున్నాయి. అయితే మరి కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ 98000 దగ్గర కొనసాగుతున్నాయి. మే 3, మంగళవారం రోజున దేశవ్యాప్తంగా బంగారం ధరలు పెరిగాయి. నిన్న జూన్ రెండు తో పోల్చుకుంటే ఈరోజు తులం బంగారంపై 1500 రూపాయలు ఎక్కువగా పెరిగినట్లు తెలుస్తుంది. ఇక ఈరోజు మన దేశ మార్కెట్లో స్వచ్ఛమైన తులం గోల్డ్ రేటు రూ.98,850, 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.90,619 గా ఉంది. ఈరోజు మన దేశ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,00,100 గా ఉంది. అయితే దేశంలో ఉన్న పలు ప్రధాన ప్రాంతాలలో బంగారం ధరలలో వ్యత్యాసం ఉంటుంది.
ఢిల్లీ నగరంలో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.99,000, 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.90,760.
ముంబై నగరంలో ఈరోజు 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.98,850, 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.90,610.
ఇక తెలుగు రాష్ట్రాలలో ప్రధాన నగరమైన హైదరాబాద్ నగరంలో ఈరోజు 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.98,850, 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.90,610.