Gold Price Today: నాలుగు రోజుల పాటు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా షాక్ ఇచ్చాయి. వెండి ధరలు సైతం తగ్గినట్లే తగ్గి మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ స్థాయిలో బంగారం స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2351 డాలర్ల వద్ద కొనసాగుతోంది. స్పాట్ సిల్వర్ ఔన్స్ 31.64 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
బులియన్ మార్కెట్ ప్రకారం.. మే28న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,650గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.72,710 గా ఉంది. మే 27న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,400తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి సోమవారంతో పోలిస్తే మంగళవారం రూ.250 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,810 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,870గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,650 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.72,710 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.67,210 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,320తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,650 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,710తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,650తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,710తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలతో పాటు వెండి ధరలు పెరిగాయి. మంగళవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.93,100గా నమోదైంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం స్థిరంగా కొనసాగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.93,100గా ఉంది. ముంబైలో రూ.93,100, చెన్నైలో రూ.97,600 బెంగుళూరులో 93,350, హైదరాబాద్ లో రూ. 97,600 తో విక్రయిస్తున్నారు.