Hero Fans: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులు స్టార్ హీరోలుగా వెలుగొందడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుంటారు. కెరియర్ స్టార్టింగ్ లోనే తమ మార్కును చూపిస్తూ ఒక ఐడెంటిటిని కోరుకుంటుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒక్కో హీరో ఒక్కో స్ట్రాటజీ ని మైంటైన్ చేస్తూ వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చూసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పటివరకు ఎవరు చేయనటువంటి సినిమాలను చేయడానికి మన హీరోలు కూడా ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…ఇక ఇదిలా ఉంటే హీరోల కోసం అభిమానులు వాళ్ళ గుండెల మీద పచ్చబొట్టు వేయించుకోవడం వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు చేయడం లాంటివి చేస్తుంటారు. వాళ్ళ బర్త్డే రోజు రక్త దానాలు కూడా చేస్తారు. ఇలాంటి క్రమంలోనే వాళ్ల అభిమానుల కోసం హీరోలు ఏం చేస్తున్నారు అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యర్థమవుతున్నాయి. కొంతమంది హీరోలు అభిమానులను దృష్టిలో పెట్టుకొని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికి మరికొంతమంది మాత్రం అసలు అభిమానులను పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీ అభిమాని అయిన నాగరాజు అనే కుర్రాడు అయ్యగారి నెంబర్వన్ అంటూ అఖిల్ ప్రతి సినిమాకి ప్రమోషన్ చేస్తూ ఉంటాడు.
సినిమా థియేటర్ ముందు నానా హంగామా చేస్తుంటాడు. ఇక రీసెంట్ గా నాగరాజు కి సంబంధించిన ఒక విషయమైతే అందరికి తెలిసింది. అతని భార్యకి మాటలు రావని,బ్యానకి ఒక కూతురు ఉందని తను ఉండే చిన్న ఇంటిలోనే నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కి సంబంధించిన ఫోటోలను పెట్టుకున్నారు.
అతని కోసం వాళ్ల అభిమాన హీరో అయిన అఖిల్ ఏదైనా చేయొచ్చు కదా! అతను ఇల్లు కట్టుకోవడానికి కొంత డబ్బుల్ని ఇవ్వచ్చు కదా అంటు కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే అఖిల్ కి ఎవ్వరు సపోర్ట్ చేయనప్పుడు కూడా ఆయన అఖిల్ సినిమా మొదటి రోజు రిలీజ్ అవుతున్నప్పుడు అది ఎంత పెద్ద ఫ్లాప్ సినిమా అయిన కూడా థియేటర్ దగ్గరికి వెళ్లి అయ్యగారే నెంబర్ వన్ అంటూ అరుస్తూ అఖిల్ కోసం చాప చేశాడు.
అలాగే అభిమానుల సంఘాన్ని కూడా కదిలించాడు. అలాంటి వ్యక్తి కోసం ఏదైనా చేయొచ్చు కదా అంటూ ఇప్పుడు సినిమా విమర్శకులు సైతం అఖిల్ ని కోరుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా చరిత్రలో అభిమానుల కోసం హీరోలు చేసిన దాని కంటే హీరోల కోసం అభిమానులు చేసిన గొప్ప పనులే చాలా ఎక్కువగా ఉన్నాయి…
