Horoscope Today: ఈ రాశి వారికి హనుమంతుడి అండ.. దీంతో లాభాలే లాభాలు..

Horoscope Today: 2024 మే 28 మంగళవారం రోజున ద్వాదశ రాశులపై ఉత్తరాషాడ, శ్రావణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు.

Written By: Chai Muchhata, Updated On : May 28, 2024 8:23 am

horoscope lord hanuman

Follow us on

Horoscope Today: 2024 మే 28 మంగళవారం రోజున ద్వాదశ రాశులపై ఉత్తరాషాడ, శ్రావణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి హనుమంతుడి అనుగ్రహంతో అన్నీ లాభాలే జరగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉండనున్నాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:
సన్నిహితులతో సరదాగా ఉంటారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.

వృషభ రాశి:
పాత స్నేహితులను కలుస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు సీనియర్ల నుంచి సలహా తీసుకుంటారు. ఉద్యోగులు ప్రశాంత వాతావరణంలో ఉంటారు.

మిథున రాశి:
పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనుల కోసం ఇతరుల సలహా తీసుకుంటారు. ఈరోజు అనుకోని అదృష్టం ఉండనుంది. ప్రత్సాహకరమైన బహుమతులు అందుకుంటారు.

కర్కాటక రాశి:
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకోని అదృష్టం వరించనుంది. కొత్త ఆదాయాలు ఉంటాయి. పెండింగు సమస్యలను పరిష్కరిస్తారు. స్నేహితుల నుంచి శుభవార్త వింటారు.

సింహారాశి:
ఆత్మీయుల సహకారం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులు చేసే పనిపై శ్రద్ధ వహించాలి. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొన్ని విషయాల్లో నష్టాన్ని చవి చూస్తారు.

కన్య రాశి:
వ్యాపారుల ఆర్థిక ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు ప్రమోషన్లు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెల్తారు. కొన్ని పొరపాట్ల నుంచి గుణపాఠం నేర్చుకుంటారు.

తుల రాశి:
ఆర్థిక లావాదేవీల విషయంలో తొందరపడొద్దు. కొన్ని ప్రణాళికలు లాభిస్తాయి. ఏ పని చేసినా నిర్లక్ష్యంతో ఉండొద్దు. వివిధ మార్గాల నుంచి లాభాలు పొందుతారు.

వృశ్చిక రాశి:
కొందరు వ్యక్తుల నుంచి శుభవార్తలు వింటారు. కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఉత్సాహం చూపుతారు. పెద్దల మాటలను గౌరవించాలి. వ్యాపారులు ఇతరుల సలహా తీసుకోవాలి.

ధనస్సు రాశి:
కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. పెండింగు సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఓ విషయం గురించి శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి మద్దతు అధికంగా ఉంటుంది.

మకర రాశి:
వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మద్దతు బాగా ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుంభరాశి:
కుటుంబ సభ్యులతో బిజీగా ఉంటారు. పూర్వీకుల ఆస్తిపై శుభవార్త వింటారు. ఇతరులతో సత్సంబంధాలు నెలకొల్పుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

మీనరాశి:
కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. పెరుగుతున్న ఖర్చులను నియంత్రించుకోవాలి. కటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు.