Homeబిజినెస్Gold Rates Today: మళ్లీ పెరిగిన బంగారం.. ఈరోజు ఎలా ఉన్నాయంటే?

Gold Rates Today: మళ్లీ పెరిగిన బంగారం.. ఈరోజు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today: బంగారం ధరలు రిలీఫ్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ షాక్ ఇచ్చాయి. గురువారం మరోసారి ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పడుతున్నాయి. దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

బులియన్ మార్కెట్ ప్రకారం.. ఏప్రిల్ 25న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,600గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.72,660 గా ఉంది. ఏప్రిల్ 24న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,150తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి బుధవారంతో పోలిస్తే గురువారం రూ.450 పెరిగింది. అయితే 5 రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వచ్చి..ఈరోజు పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,760 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,810 గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,610 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.72,660 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.67,310 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,430తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,610 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,660తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,610తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,660తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలు పెరిగినా వెండి ధరలు మాత్రం దిగుతున్నాయి. గురువారం ఓవరాల్ గా కిలో వెండి రూ.82,800గా నమోదైంది. బుధవారంతో పోలిస్తే గురువారం రూ.100 తగ్గింది.కొన్ని రోజులగా భారీ స్థాయిలో వెండి ధరలు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.82,800గా ఉంది. ముంబైలో రూ.82,800, చెన్నైలో రూ.86,300, బెంగుళూరులో 82,400, హైదరాబాద్ లో రూ.86,300తో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Varanasi Teaser

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...
Monsoon Health Tips

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...
Furniture Rental

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Today 22 July 2026 Horoscope

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...
Oktelugu Epaper