Rajamouli: హాలీవుడ్ లో దిగ్గజ దర్శకుడుగా పేరుపొందిన జేమ్స్ కెమెరాన్ ఏ సినిమా చేసిన ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఆయన చేసిన సినిమాల్లో టైటానిక్, అవతార్, అవతార్ 2 లాంటి సినిమాలు మాత్రం ఇండియాలో కూడా భారీ కలెక్షన్లు రాబట్టడమే కాకుండా ఇండియన్స్ కి ఈ సినిమాలు ఫేవరెట్ గా మారిపోయాయి.
నిజానికి ఈ సినిమాలు చేయడం వల్లే రాజమౌళి లాంటి దర్శకుడు కూడా ఆయన స్ఫూర్తితోనే భారీ స్కేల్లో సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. ఇక ప్రస్తుతానికి మహేష్ బాబుతో చేయబోయే సినిమా కూడా భారీ ఎత్తున తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తుంది. రాజమౌళి ఈ సినిమా కోసం జేమ్స్ కెమరాన్ అవతార్ 2 లో ఎలాంటి కెమెరాలను, ఎలాంటి టెక్నాలజీ ని అయితే వాడాడో ఆ కెమెరాని ఆ టెక్నాలజీ ని ఇప్పుడు కొన్ని సీన్లను చిత్రీకరించడానికి వాడుతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఆయన వాడే టెక్నాలజీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎనీ టైం ఏ యాంగిల్ లో అయిన ఆ కెమెరాతో షూట్ చేసుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది. అందువల్ల అలాంటి ఒక కెమెరాలని తన సినిమాల కోసం వాడుకొని ది బెస్ట్ ఔట్ పుట్ గా మార్చడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి ఇలాంటి క్రమంలో ఆయన ఎంతవరకు జేమ్స్ కెమెరాన్ తీసుకొచ్చిన అవుట్ పుట్ తీసుకొస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఒకటుందని జేమ్స్ కామెరాన్ కి తెలిసేలా చేసిన దర్శకుడు కూడా రాజమౌళినే కావడం విశేషం…
ఇక త్రిబుల్ ఆర్ సినిమా గురించి జేమ్స్ కెమెరాన్ సెపరేట్ గా మాట్లాడిన విషయం అయితే మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి రాజమౌళి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి జేమ్స్ కెమెరాన్ మెచ్చే లాగా సినిమాకి ఔట్ పుట్ ని తీసుకొస్తాడా లేదా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది…