https://oktelugu.com/

Gold Prices: మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. జనవరి 12న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,600గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,830 గా ఉంది.

Written By:
  • Srinivas
  • , Updated On : January 12, 2024 / 08:56 AM IST

    Gold Prices

    Follow us on

    Gold Prices: బంగరాం ధరలు మళ్లీ తగ్గాయి. వారం రోజులుగా బంగారం ధరలు ఎంతో కొంత తగ్గుతూ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం కొనుగోలుకు మంచి అవకాశం అని అంటున్నారు. వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగడం విశేషం. దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    బులియన్ మార్కెట్ ప్రకారం.. జనవరి 12న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,600గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,830 గా ఉంది. జనవరి 11న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,700తో విక్రయించారు. గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు రూ.100 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,750 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,980గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,600 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.62,830 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,100 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,380తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,600 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,830తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,600తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,830తో విక్రయిస్తున్నారు.

    బంగారం ధరలు తగ్గినా వెండి ధరలు స్థిరంగా కొనసాగాయి. శుక్రవారంవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.76,000గా నమోదైంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం వెండి ధరల్లో ఎటువంటి మార్పులు లేవు. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.76,000గా ఉంది. ముంబైలో రూ.76,000, చెన్నైలో రూ.77,500, బెంగుళూరులో 73,500, హైదరాబాద్ లో రూ.77,500తో విక్రయిస్తున్నారు.