Rashi Phalalu: ఈ రాశివారు ప్రత్యర్థులతో జాగ్రత్త..

ప్రతి చిన్న విషయానికి కోప్పడకుండా ఉండాలి. కొత్త విషయాలు నేర్చుకుంటారు. ప్రియమైన వారితో సమస్యలు వస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

Written By: Chai Muchhata, Updated On : January 12, 2024 8:53 am

Rashi Phalalu

Follow us on

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జనవరి 12న శుక్రవారం ద్వాదశ రాశులపై ఉత్తరాషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. మరి కొందరికి ప్రతికూల వాతావరణం ఉండనుంది. ముఖ్యంగా ఓ రాశివారు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

మేషరాశి:
ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వామి కోసం ఏదైనా చేస్తారు. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు.

వృషభం:
వీరు ఈరోజు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ప్రణాళిక ప్రకారం వ్యాపారం చేస్తారు.

మిథునం:
ఆదాయం పెరుగుతుంది. సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం.వ్యాపారుల పెట్టుబడులకు లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ.

కర్కాటకం:
వ్యాపారాన్ని పెంచుకునేందుకు ప్రణాళికలు వేస్తారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. విలాసాల కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు.

సింహ:
ప్రతి చిన్న విషయానికి కోప్పడకుండా ఉండాలి. కొత్త విషయాలు నేర్చుకుంటారు. ప్రియమైన వారితో సమస్యలు వస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

కన్య:
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రశాంత వాతావరణం గడుపుతారు. ఉద్యోగులకు తోటి వారి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి.

తుల:
వైవాహిక జీవితం గడిపేవారు సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. కొత్త జీవితం కనిపిస్తుంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.

వృశ్చికం:
ఒకేసారి అనేక పనులు చేయాల్సిన రావచ్చు. ప్రణాళికతో వాటిని పూర్తి చేయాలి. ప్రియమైన వారి నుంచి శుభవార్తలు వింటారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

ధనస్సు:
వివాహితులకు ఉండే సమస్యలు తొలగిపోతాయి. మానసికంగా ఒత్తిడి నుంచి దూరమవుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వాతావరణంలో మార్పుల కారణంగా జాగ్రత్తగా ఉండాలి.

మకర:
వ్యాపారులు పెట్టుబడులు పెట్టేందుకు అనువైన సమయం. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. మానసికంగా కొన్ని ఇబ్బందులు రావొచ్చు.

కుంభం:
ఖర్చులు పెరుగుతాయి. దీంతో కొంత ఆందోళన వాతావరణం పెరుగుతుంది. ప్రత్యర్థులు మీపై విజయం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తారు. వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీనం:
ఆదాయం సాధారణంగా ఉంటుంది. వ్యాపారులు పెట్టుబడులు పెడితే లాభాలు వచ్చే అవకాశం. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువ.