Prakash Raj: గుంటూరుకారంలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కు థియేటర్లు దద్దరిల్లుడేనట.. ఇంతకీ ఏం చేస్తాడంటే..?

గుంటూరు కారం సినిమాతో కూడా ఆయన మరొక మంచి సక్సెస్ ని సాధించబోతున్నాడు అనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా రేపు రిలీజ్ అవుతున్నప్పటికీ ఇప్పుడు చాలా చోట్ల ఈ సినిమా ప్రీమియర్లైతే వేశారు.

Written By: Gopi, Updated On : January 12, 2024 9:08 am

Prakash Raj

Follow us on

Prakash Raj: సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్లదాకా ప్రతి ఒక్కరు ఇష్టపడుతుంటారు. ఆయన సినిమాల్ని చూడడానికి ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే ఆయన అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళని తన ఫ్యాన్స్ గా మార్చుకొని వరుస సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నారు.

ఇక గుంటూరు కారం సినిమాతో కూడా ఆయన మరొక మంచి సక్సెస్ ని సాధించబోతున్నాడు అనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా రేపు రిలీజ్ అవుతున్నప్పటికీ ఇప్పుడు చాలా చోట్ల ఈ సినిమా ప్రీమియర్లైతే వేశారు. ఇక దానికి సంబంధించిన మౌత్ టాక్ కూడా బయట ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వబోతుంది అంటూ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే మహేష్ బాబు మొదటి సినిమా అయిన రాజకుమారుడు సినిమా నుంచి ఇప్పటివరకు కవాళ్ల కాంబినేషన్స్ కంటిన్యూ అవుతూనే వస్తుంది.

ఇక ఇప్పటి వరకు మహేష్ బాబు హీరోగా వచ్చిన అన్ని సినిమాల్లో ఒకటి రెండు సినిమాలను మినహాయిస్తే మిగిలిన అన్ని సినిమాల్లో ప్రకాష్ రాజ్ ఏదో ఒక పాత్రలో మనకు కనిపిస్తూనే ఉంటాడు. సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కి మంచి గుర్తింపు ఉంటుంది. అలాంటి కాంబినేషన్ లో ప్రకాష్ రాజ్ మహేష్ బాబు కాంబినేషన్ ది బెస్ట్ కాంబినేషన్ అనే చెప్పాలి. ఇక గుంటూరు కారం సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ చాలా మంచి పర్ఫామెన్స్ ఇచ్చి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు రావడం వల్ల ప్రకాష్ రాజ్ కి సరైన క్యారెక్టర్ పడటం లేదు.

ఇంతకుముందు నువ్వు నాకు నచ్చావ్ చిరునవ్వుతో,నువ్వే నువ్వే,అతడు, జల్సా లాంటి సినిమాలతో ప్రకాష్ రాజ్ లోని నటుడిని పూర్తిస్థాయిలో వాడుకున్న త్రివిక్రమ్ ఇప్పుడు ఈ సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ నుంచి నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ ని రాబట్టుకున్నట్టుగా తెలుస్తుంది. మహేష్ బాబు తో పోటీపడి ప్రకాష్ రాజ్ అద్భుతంగా నటించడమే కాకుండా చాలా చోట్ల మహేష్ బాబు ని డామినేట్ చేస్తూ తన నట విశ్వరూపం చూపించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే గుంటూరు కారం సినిమాతో మహేష్ బాబు కి సక్సెస్ వస్తే ప్రకాష్ రాజ్ కి మరొకసారి ది బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు వస్తుంది అంటూ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ప్రకాష్ రాజ్ గురించి సపరేట్గా చెప్తున్నారు…ఆయన క్యారెక్టర్ ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది…