Gold Prices: మరోసారి పెరిగిన బంగారం ధరలు.. ఈరోజు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. డిసెంబర్ 9న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,700గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,950 గా ఉంది. డిసెంబర్ 8న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,550తో విక్రయించారు.

Written By: Chai Muchhata, Updated On : December 9, 2023 8:47 am

Gold Prices

Follow us on

Gold Prices: బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రెండు రోజులకు రూ. 100కు పైగా హైక్ పొజిషన్లోకి వెళ్లాయి. శనివారం రూ.150 మేర పెరిగింది. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.

బులియన్ మార్కెట్ ప్రకారం.. డిసెంబర్ 9న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,700గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,950 గా ఉంది. డిసెంబర్ 8న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,550తో విక్రయించారు. శుక్రవారం కంటే శనివారం బంగారం ధరలు రూ.150 మేర పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,850 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,100గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,700 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.62,950 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,350 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,660తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,700 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,950తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,700తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,950తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలు పెరిగినా వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగాయి. శనివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.77,200గా నమోదైంది. శుక్రవారంతో పోలిస్తే శనివారం వెండి ధరల్లో ఎలాంటి మార్పలు లేవు. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.77,200గా ఉంది. ముంబైలో రూ.77,200, చెన్నైలో రూ.80,000, బెంగుళూరులో 76,500, హైదరాబాద్ లో రూ.80,000తో విక్రయిస్తున్నారు.