Gold Price Today: మొన్నటి వరకు బంగారం ధరలు ఎగబాకాయి. అయితే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలా మంది బంగారం ధరలు మరింత పెరుగుతాయని భావించారు. కానీ స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధరలు తగ్గాయి. కానీ వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
Also Read: విండో, స్ప్లిట్ ఏసీలకు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? ఎంతకాలం వాడొచ్చు?
బులియన్ మార్కెట్ ప్రకారం.. ఏప్రిల్ 26 న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,040గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.98,230గా ఉంది. ఏప్రిల్ 25న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ..90,050తో విక్రయించారు. 10 గ్రాముల బంగారం ధర సోమవారంతో పోలిస్తే మంగళవారం తగ్గింది. దేశంలోని ప్రధాన నగారల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,170 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.98,330గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.90,040 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.98,230 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.90,040 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.98,230తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.90,040 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.98,230తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.90,0400తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.98,230తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. శనివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.1,00,800గా నమోదైంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం రూ.100 తగ్గింది. వెండి ధరలు స్వల్పంగా తగ్గినా మరింతగా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.1,00,800గా ఉంది. ముంబైలో రూ.1,00,800 చెన్నైలో రూ.1,00,800 బెంగుళూరులో 1,00,800, హైదరాబాద్ లో రూ. 1,00,800 తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలు లక్ష మార్కుకు పైకి చేరడంతో చాలా మంది కొనుగోలు చేయడానిక వెనుకడుగు వేస్తున్నారు. మరోవైపు త్వరలో అక్షయ తృతీయ ఉండడంతో ఈ సందర్భంగా బంగారం కొనాలని అనుకున్నా.. ధరలను చూసి భయపడిపోతున్నారు. అయితే ఓ వైపు బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత రెండు రోజులగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ ధరలు ఇలాగే కొనసాగితే బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు తగ్గితే మరింత ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే అంతర్జాతీయ పరిస్థితులపై ఆధారపడి ఉన్నందున బంగారం ధరలపై పూర్తిగా ఒకేలాగా ఆలోచించాల్సిన అవసరం లేదని అంటున్నారు. పడిపోయిన బంగారం ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందని తెలుపుతున్నారు.
Also Read: వెయిటింగ్ కు ఎండ్ కార్డ్.. మారుతి ఈవీ వచ్చేస్తోంది.. ప్రత్యేకతలు ఇవే!