Homeఎంటర్టైన్మెంట్Samantha : ఆ స్టార్ సింగర్ భర్త సమంతను అంతలా చూసుకున్నాడా? ఓపెన్ అయిన స్టార్...

Samantha : ఆ స్టార్ సింగర్ భర్త సమంతను అంతలా చూసుకున్నాడా? ఓపెన్ అయిన స్టార్ లేడీ

Samantha : ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టి సక్సెస్ అయ్యింది సమంత. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన సమంత చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ చేసింది. చిన్న చిన్న యాడ్స్ లో నటించింది. అలా వచ్చిన డబ్బులతో సమంత తన ప్యాకెట్ మనీ సమకూర్చుకునేది. ఏమాయ చేసావే మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన మొదటి చిత్రంతోనే అభిమానులను సొంతం చేసుకుంది. నాగ చైతన్యకు జంటగా నటించిన ఏమాయ చేసావే సూపర్ హిట్ కొట్టింది. నాగ చైతన్య-సమంత కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి.

అక్కడి నుండి సమంత వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూ స్టార్ లేడీగా ఎదిగింది. కెరీర్ పరంగా సక్సెస్ ట్రాక్ దూసుకెళుతున్న సమంత వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంది. నాగ చైతన్యను ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. 2017లో గోవా వేదికగా ఘనంగా వీరి వివాహం జరిగింది. అనంతరం వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. 2021లో సమంత-నాగ చైతన్య విడాకుల ప్రకటన చేశారు. పరస్పర అవగాహనతో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ ఘటన సమంతను మానసిక వేదనకు గురి చేసింది. ఆమె మీద తప్పుడు ప్రచారం జరిగింది.

Also Read : అనారోగ్యం కారణంగానే విడాకులు..? సంచలనం రేపుతున్న సమంత రెస్పాన్స్!

అయినప్పటికీ సమంత ఎదిరించి నిలబడ్డారు. విడాకుల బాధ నుండి కోలుకుంటున్న తరుణంలో సమంతను మరో సమస్య వెంటాడింది. మయోసైటిస్ బారిన పడ్డారు ఆమె. ఈ వ్యాధికి చికిత్స తీసుకునేందుకు సమంత ఏడాది పాటు విరామం తీసుకుంది. కాగా తనకు వ్యాధి సోకిన సమయంలో ఓ ప్రముఖుడు తనను దగ్గరుండి చూసుకున్నాడని సమంత తాజాగా వెల్లడించింది. స్టార్ సింగర్ చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ ని ఉద్దేశిస్తూ సమంత కీలక కామెంట్స్ చేసింది.

నేను అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో రాహుల్ రవీంద్రన్ మద్దతుగా నిలిచాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు నాతోనే ఉంటూ జాగ్రత్తగా చూసుకునేవాడు. ఫ్రెండా? సోదరుడా? రక్త సంబంధీకుడా? కుటుంబ సభ్యుడా? అతనితో నా బంధం ఏమిటో చెప్పలేను.. అని సమంత అన్నారు. రాహుల్ రవీంద్రన్ నటుడు, దర్శకుడు కూడాను. సమంతకు ఆయన భార్య చిన్మయి డబ్బింగ్ చెప్పేది. ఈ మధ్య సమంత స్వయంగా చెప్పుకుంటుంది.

Also Read : నాగ చైతన్య సినిమాని ఇప్పుడు చూస్తుంటే భయం వేస్తుంది : సమంత

Exit mobile version