Maruti : ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మారుతి సుజుకి, మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు గ్రాండ్ విటారా ఎలక్ట్రిక్ (e-Vitara) త్వరలోనే విడుదల కానుంది. ఈ విటారా డెలివరీలు సెప్టెంబర్ చివరి నుంచి ప్రారంభమవుతాయని మారుతి సుజుకి కన్ఫాం చేసింది. దేశంలోనే అతిపెద్ద ఫోర్-వీలర్ తయారీ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో 70,000 యూనిట్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నాలుగో త్రైమాసిక ఫలితాల గురించి మారుతి ఛైర్మన్ ఆర్ సి భార్గవ మాట్లాడుతూ..చాలా ఎలక్ట్రిక్ మోడళ్లు ఇతర దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. మిగిలినవి డిమాండ్‌ను బట్టి దేశీయ మార్కెట్‌లో డెలివరీ చేస్తామన్నారు.
Also Read : లీటరుకు ఏకంగా 34 కిమీ మైలేజ్.. రోజూ ప్రయాణించడానికి బెస్ట్ కార్లు ఇవే !
మారుతి సుజుకి మొదటిసారిగా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో గ్రాండ్ విటారా ఎలక్ట్రిక్‌ను ఆవిష్కరించింది. మారుతి సుజుకి ఈ విటారా రెండు బ్యాటరీ ఎంపికలతో వస్తుంది. ఇందులో 49 kWh, 61 kWh ఆప్షన్‌లు ఉంటాయి. 61 kWh బ్యాటరీతో కూడిన టాప్-స్పెక్ మోడల్‌లో ట్విన్ మోటార్లు, సుజుకి ఆల్‌గ్రిప్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ చూడవచ్చు. మారుతి సుజుకి ఈ విటారాపై 10 సంవత్సరాలు లేదా 160,000 కిలోమీటర్ల బ్యాటరీ వారంటీని అందిస్తుంది. మారుతి సుజుకి ఈ విటారా ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 500 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుందని అంచనా.
ఈ విటారా లాంచ్ ఎప్పుడు?
గ్రాండ్ విటారా ఎలక్ట్రిక్ SUV మే లేదా జూన్‌లో విడుదల కావచ్చు. ఎలక్ట్రిక్ కారును కూడా నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే విక్రయిస్తామని మారుతి సుజుకి చెబుతోంది.ప్రత్యేక డీలర్లను నియమించే ప్రణాళిక ఏమీ లేదని చెప్పింది. ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల కోసం మారుతి ప్రస్తుత సామర్థ్యాన్ని ఉపయోగిస్తుంది. భారతీయ మార్కెట్‌లో మారుతి సుజుకి ఈ-విటారా హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ ఈవీ, మహీంద్రా బీఈ 6, ఎంజి జెడ్‌ఎస్ ఈవీలకు పోటీ ఇవ్వనుంది.
మారుతి నుంచి మరో SUV
ఛైర్మన్ ఆర్ సి భార్గవ ఈ సంవత్సరం చివరి నాటికి మారుతి సుజుకి తన పోర్ట్‌ఫోలియోలో మరొక SUVని చేర్చుతుందని కూడా స్పష్టం చేశారు. మారుతి సుజుకి గ్రాండ్ విటారా 7-సీటర్ వేరియంట్‌ను రోడ్లపై పరీక్షిస్తున్నట్లు చాలా సార్లు కనిపించింది. రాబోయే SUV బహుశా 7-సీటర్ గ్రాండ్ విటారా కావచ్చు.
అన్ని మారుతి కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు
ఆర్ సి భార్గవ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం చివరి నాటికి అన్ని మారుతి సుజుకి కార్లకు స్టాండర్డ్ గా 6ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తామని తెలిపారు. ఇటీవల కార్ల తయారీ సంస్థ MY2025 గ్రాండ్ విటారా, MY2025 వ్యాగన్ఆర్‌లలో కూడా ఈ సేఫ్టీ ఫీచర్‌ను అప్‌డేట్ చేసింది.
Also Read : మారుతి వెబ్‌సైట్‌లో గ్రాండ్ విటారా సీఎన్‌జీ మాయం.. అసలేమైందంటే ?