Gold Price: ప్రస్తుతం బంగారం ధర ఆకాశాన్ని అంటుతుంది. 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయల మార్కుకు చేరింది. అయితే గత రెండు రోజులుగా బంగారం ధర తగ్గినప్పటికీ వాటికి డిమాండ్ ఉన్న కారణంగా మళ్ళీ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ క్రమంలో కొందరు అవసరం ఉన్నవారు ధరతో సంబంధం లేకుండా బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. మరికొందరు మాత్రం బంగారం ధర తగ్గినప్పుడు మాత్రమే కొనాలని చూస్తారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే బంగారం తగ్గేట్లు కనిపించడం లేదు. కానీ కొన్ని రాష్ట్రాల్లో బంగారం ధర తక్కువగా ఉంటుంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ తగ్గింపు ధరలు ఉండడంతో చాలామంది ఇక్కడ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇంతకీ బంగారం తక్కువ ధర ఉన్న రాష్ట్రం ఏది? అక్కడ ఎందుకు తక్కువగా ఉంటుంది?
Also Read: మీకు IPO కేటాయింపులో సమస్య వస్తుందా? ఇంతకీ ఏం చేయాలంటే?
భారతదేశంలోని తెలంగాణతో పాటు ఢిల్లీ, ముంబై నగరాల్లో బంగారానికి డిమాండ్ విపరీతంగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ బంగారం వినియోగం ఎక్కువగా ఉండడంతో ధరలు కూడా మిగతా ప్రాంతాల్లో కంటే అధికంగానే ఉంటాయి. అయితే వీటికి భిన్నంగా కేరళ రాష్ట్రంలో బంగారం ధరలు తక్కువగా ఉంటాయి. భారతదేశానికి నైరుతి వైపున ఉన్న కేరళకు సముద్రపు సరిహద్దు ఉంది. దీంతో విదేశాల నుంచి నిత్యం సరుకులు ఈ రాష్ట్రానికి దిగుమతి అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో బంగారం కూడా నేరుగా ఈ రాష్ట్రానికి వస్తుందని కొందరు అంటారు. అందువల్ల ఇక్కడ సుంకాలు మినహాయించి తక్కువ ధరకే బంగారాన్ని విక్రయిస్తూ ఉంటారని అంటారు.
అయితే ఈ రాష్ట్రంలో జీఎస్టీని కట్టకుండా బంగారం విక్రయిస్తారని కొందరు చెబుతారు. అందుకే తక్కువ ధరకే ఇస్తారని చెబుతారు. అయితే దీనిని అధికారికంగా ఎవరు దృవీకరించలేదు. మరోవైపు ఈ రాష్ట్రంలో బంగారం తలసరి వినియోగం తక్కువగా ఉంటుంది. ఇక్కడివారు బంగారం వేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు. అందువల్ల బంగారానికి ఇక్కడ డిమాండ్ లేకపోవడంతో ధర కూడా తక్కువగా ఉంటుందని చెబుతారు. కానీ మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఇక్కడ కొనుగోలు చేస్తూ ఉంటారు.
కేరళతోపాటు గోవాలోనూ బంగారం ధర తక్కువగానే ఉంటుంది. ఇక్కడ మిగతా రాష్ట్రాల్లో కంటే టాక్స్ తక్కువగా ఉండడంతో బంగారం ను తక్కువ ధరతోనే విక్రయిస్తారని చెబుతారు. అలాగే పాండిచ్చేరిలోనూ బంగారం ధర తక్కువగా ఉంటుందని చెబుతారు. ఇలా కొన్ని రాష్ట్రాల్లో బంగారం ధర తక్కువగా ఉండడంతో అక్కడికి వెళ్లి కొనుగోలు చేయాలని అనుకుంటారు.
అయితే ప్రత్యేకంగా బంగారం కొనుగోలు చేయడానికి అని కాకుండా ఏదైనా పనుల కోసం వెళ్లి కొనుగోలు చేస్తే సేఫ్ అవుతుంది. కానీ ఎక్కువమంది ఇలా కొనుగోలు చేయరు. సొంత రాష్ట్రంలోనే కావలసినప్పుడు బంగారం కొనుగోలు చేస్తారు. మరోవైపు ఇప్పుడు అంతా ఆన్లైన్ లోనే బంగారం పెట్టుబడులు పెడుతున్నారు. లిక్విడ్ గా తీసుకోవడం వల్ల అనేక సమస్యలు ఉంటాయి. అయితే మహిళలు ఆభరణాలు కొనుగోలు చేయాలని అనుకుంటే ఆయా రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఇది సాధ్యపడుతుంది.