https://oktelugu.com/

వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. ఈ ఏడాది రాబోయే కొత్త ఫీచర్లివే..?

మన దేశంలో కోట్ల సంఖ్యలో యూజర్లు వినియోగిస్తున్న యాప్ లలో వాట్సాప్ యాప్ ఒకటి. ఇప్పటికే ఎన్నో కొత్త ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ యాప్ యూజర్లకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ఈ ఏడాది మరికొన్ని కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. రాబోయే రోజుల్లో యూజర్లకు మెరుగైన అనుభవాన్ని పంచేందుకు వాట్సాప్ ఐదు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. Also Read: పెన్షన్ తీసుకునే వారికి మోదీ సర్కార్ శుభవార్త.. వారికి బెనిఫిట్..? […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 15, 2021 11:15 am
    Follow us on

    WhatsApp New Features

    మన దేశంలో కోట్ల సంఖ్యలో యూజర్లు వినియోగిస్తున్న యాప్ లలో వాట్సాప్ యాప్ ఒకటి. ఇప్పటికే ఎన్నో కొత్త ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ యాప్ యూజర్లకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ఈ ఏడాది మరికొన్ని కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. రాబోయే రోజుల్లో యూజర్లకు మెరుగైన అనుభవాన్ని పంచేందుకు వాట్సాప్ ఐదు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది.

    Also Read: పెన్షన్ తీసుకునే వారికి మోదీ సర్కార్ శుభవార్త.. వారికి బెనిఫిట్..?

    వాట్సాప్ అతి త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్న ఫీచర్లలో వాట్సాప్ లాగ్అవుట్ ఫీచర్ కూడా ఒకటి. వాట్సప్ బీటా ఇన్ఫో నివేదికల ప్రకారం వాట్సాప్ యూజర్లు ఈ ఫీచర్ ద్వారా ఫోన్ లేకుండా వాట్సాప్ ను వినియోగించవచ్చు. వెబ్ ద్వారా వాట్సాప్ యాప్ ను వినియోగించే వారికి ఈ ఫీచర్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. వాట్సాప్ యూజర్ల కొరకు తెచ్చిన మరో అద్భుతమైన ఫీచర్ వాట్సాప్ మల్టీ-డివైస్ ఫీచర్.

    Also Read: లక్ అంటే ఈ కుక్కదే.. ఏకంగా రూ.36 కోట్ల ఆస్తి..?

    వాట్సాప్ మల్టీ-డివైస్ ఫీచర్ కోసం యూజర్లు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ ఫీచర్ సహాయంతో ఒకటి కంటే ఎక్కువ పరికరాల్లో ఒకే నంబర్ నుంచి వాట్సాప్ లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మొబైల్ లో మాత్రమే వాట్సాప్ లాగిన్ అయ్యే అవకాశం ఉండగా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే వాట్సాప్ యూజర్లకు ప్రయోజనం చేకూరుతుంది. వాట్సాప్ ఐఓఎస్ యూజర్ల కొరకు పేస్ట్ మల్టీపుల్ ఐటమ్స్ ఫీచర్ ను కూడా అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    ఈ ఫీచర్ ద్వారా మల్టీపుల్ ఫోటోలను, వీడియోలను కాఫీ చేసి చాట్ లో పేస్ట్ చేసుకోవచ్చు. వాట్సాప్ రీడ్ లేటర్ ఫీచర్ ద్వారా ఆ కాంటాక్ట్ లేదా గ్రూప్ యొక్క నోటిఫికేషన్లు రాకుండా చేయవచ్చు. వాట్సాప్ మ్యూట్ వీడియోలు, వాట్సాప్ వెబ్‌లో వాయిస్ మరియు వీడియో కాల్స్ ఫీచర్లు కూడా త్వరలో వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది.