Cab : నగరాల్లో ఇప్పుడు Cabలదే హవా నడుస్తుంది. ఒకప్పుడ నగరాల్లో ఒక చోట నుంచి మరో చోటుకు వెళ్లాలంటే ఆటోలు మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు ట్రాఫిక్ పెరగడంతో పాటు నగరాలు విస్తరిస్తుండడంతో దూరం పెరుగుతుంది. దీంతో అనుకున్న సమయానికి గమ్యాన్ని చేరుకోవాలంటే క్యాబ్ లు అనుగుణంగా ఉంటుంది. కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా క్యాబ్ సర్వీసులను అందిస్తున్నాయి. ప్రతిరోజూ కార్యాలయలకు వెళ్లేవారు, ఎయిర్ పోర్టుకు వెళ్లేవారు ఎక్కువగా క్యాబ్ బుక్ చేసుకుంటున్నారు. అయితే వీటి ఛార్జిలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఈ ఛార్జీల గురించి ముందే తెలుసుకోవచ్చు. కానీ కొందరు చీటింగ్ చేస్తూ అదనంగా డబ్బులు వసూలు చేస్తారు. అదెలాగంటే?
నిలబడిన చోటు నుంచి గమ్యానికి చేరాలంటే క్యాబ్ సర్వీస్ అనుగుణంగా ఉంటుంది. ఆన్ లైన్ లో బుకింగ్ సౌకర్యం ఉన్న ఈ క్యాబ్ లను వివిధ కంపెనీలు ప్రయాణికులకు అనుగుణంగా సర్వీసులను అందిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో క్యాబ్ లో ప్రయాణించే వారికి ప్రత్యేకంగా యాప్ లను అందిస్తూ క్యాబ్ వివరాలను ముందే చెప్పేస్తుంటాయి. దీని ప్రకారంగానే క్యాబ్ లో ప్రయాణించాలా? వద్దా? అనేది కస్టమర్ డిసైడ్ చేసుకుంటారు. అయితే ఒక్కోసారి Price Charge యాప్ లో ఒక విధంగా చూపించి.. మనీ పే చేసే సమయంలో మరో విధంగా చూపిస్తుంది. దీనిపై ఇప్పటికే చాలా వరకు కంప్లయింట్స్ వెళ్లాయి. అయితే క్యాబ్ సర్వీసును అందింటే డ్రైవర్లు ప్రయాణికుల నుంచి కొన్ని ఛార్జీల పేరిట అదనంగా వసూలు చేస్తున్నారు.
ఉదాహరణకు ఎయిర్ పోర్టు నుంచి నివాసానికి చేరుకోవాలనంటే రూ.1000 ఛార్జి అవుతుంది. కానీ గమ్యానికి చేరిన తరువాత వీటితో పాటు అదనంగా రూ.320 వసూలు చేస్తున్నారు. ఇందులో రూ.270 పార్కింగ్ ఫీజు మిగతాది టోల్ గేట్స్ ఛార్జి అని చెబుతున్నారు. వాస్తవానికి ముందుగా చూపించిన ప్రైస్ షీట్ లోనే వీటికి సంబంధించిన ఛార్జిల వివరాలు ఉంటాయి. పార్కింగ్ ఫీజు, టోల్ గేట్ ఛార్జీలతో కలిపి ఛార్జీలు చూపిస్తారు. కానీ డ్రైవర్లు అదనంగా వసూలు చేస్తున్నారు. అందువల్ల క్యాబ్ లో ప్రయాణించేవారు ఈ విషయాన్ని గమనించుకోవాలి. లేకుంటే తీవ్రంగా నష్టపోతుంటారు. ఒకవేళ ఎవరైనా డ్రైవర్లు వినకుండా ఉంటే 1800-11-4000 నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు అందించాలి.
ఇక క్యాబ్ లో ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండలి. పర్సనల్ కు సంబంధించిన విషయాలు ఫోన్లో మాట్లాడకుండా ఉండాలి. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తే క్యాబ్ ప్రారంభమైన తరువాత మొబైల్ లో గూగూల్ మ్యాప్ ను ఆన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే సరైన మార్గంలో క్యాబ్ వెళ్తుందా? లేదా? అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. కొందరు షార్ట్ కట్ అని చెప్పి ఇతర మార్గాల నుంచి వెళ్తారు. కానీ అలా నమ్మడం వల్ల తీవ్రంగా ఇబ్బందులకు గురవుతారు. ఏదైనా కంపెనీకి చెందిన క్యాబ్ బుక్ చేయడం వల్ల ఇబ్బందులకు గురైతే వెంటనే ఆ కంపెనీకి సంబంధించి కస్టమర్ కేర్ కు కాల్ చేసి ఫిర్యాదును అందించవచ్చు. అప్పటికీ స్పందించకపోతే పోలీస్ కంప్లయింట్ ఇవ్వొచ్చు.