Hardik Pandya : ఇటీవల దక్షిణాఫ్రికా టోర్నీ లోనూ హార్దిక్ ఇదే స్థాయిలో బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు తాజాగా అతడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రెచ్చిపోయే ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ తుఫాన్ ఇన్నింగ్స్ తో రెచ్చిపోతున్నాడు.. మొన్న బరోడా, నిన్న త్రిపుర జట్లతో జరిగిన మ్యాచ్ లలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా త్రిపురతో జరిగిన మ్యాచ్లో 21 సంవత్సరాల బౌలర్ వేసిన ఒక ఓవర్లో 28 పరుగులు సాధించి మైదానంలో సునామీ సృష్టించాడు.. వరుసగా బీభత్సమైన ఇన్నింగ్స్ ఆడటంతో బౌలర్ల పాలిట హార్దిక్ మారాడు. త్రిపురతో జరిగిన మ్యాచ్లో ఎడమచేతి వాటం స్పిన్నర్ పర్వేజ్ సుల్తాన్ బౌలింగ్లో వీర విహారం చేశాడు. సిక్సర్లు, ఫోర్ లతో విరుచుకుపడ్డాడు. ఇక తమిళనాడు తో జరిగిన మ్యాచ్ లోనూ హార్దిక్ పాండ్యా విధ్వంసం సృష్టించాడు. ఫాస్ట్ బౌలర్ గుర్జాప్ నీత్ సింగ్ బౌలింగ్లో హార్దిక్ పాండ్యా ఒకటే ఓవర్లో 29 పరుగులు పిండుకున్నాడు. గుర్జాప్ బౌలింగ్ లో తొలి 3 బంతుల్లో మూడు సిక్స్ లు కొట్టాడు. ఆ తర్వాత గుర్జాప్ నో బాల్ వేశాడు. మరుసటి బంతికి పాండ్యా సిక్స్, తర్వాతి బంతికి ఫోర్ కొట్టాడు.. ఇక అదే సమయంలో ఆ ఓవర్ చివరి బంతికి సింగిల్ లను తీశాడు. మొత్తంగా గుర్జాప్ నిద్రలేని రాత్రిని పరిచయం చేశాడు. గుర్జాప్ చెన్నై జట్టు అతడు ఇటీవలి ఐపిఎల్ వేలంలో 2.20 కోట్లకు కొనుగోలు చేసింది..
ఈ మ్యాచ్లో త్రిపుర జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్స్ లో 9 వికెట్లు లాస్ అయి 109 పరుగులు చేసింది. అనంతరం బరోడా జట్టు బ్యాటింగ్ కు దిగి.. 11.2 ఓవర్లలో 115 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయాన్ని సాధించే క్రమంలో బరోడా జట్టు 9 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. ఈ దశలో విజయానికి 11వ నెల 42 పరుగులు అవసరమయ్యాయి. అయితే హార్దిక్ పాండ్యా కేవలం ఒకే ఒక ఓవర్లో విధ్వంసం సృష్టించి.. మ్యాచ్ ను ఒక్కసారిగా మలుపు తిప్పడు. జట్టును విజయతీరాలకు చేర్చాడు.. టి20 వరల్డ్ కప్ తర్వాత హార్దిక్ పాండ్యా తన ఆట తీరు పూర్తిగా మార్చేసుకున్నాడు. తన కెరియర్ లోనే అత్యంత దూకుడైన బ్యాటింగ్ చేస్తున్నాడు. బౌలర్ ఎవరనేది లెక్కపెట్టకుండా మైదానంలో తాండవం చేస్తున్నాడు. హార్దిక్ బ్యాటింగ్ పై విమర్శకులు ప్రశంసలు చేస్తున్నారు. హార్దిక్ తనదైన రోజు ఎలా ఆడతాడు నిరూపిస్తున్నాడని కొనియాడుతున్నారు.
ఆస్ట్రేలియా సిరీస్ కు జట్టులో స్థానం లభించకపోవడం వల్లే బీసీసీఐ సెలెక్టర్ల మీద కోపంతో హార్దిక్ ఇలా ఆడుతున్నాడని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. హార్దిక్ అందువల్లే అంత కసితో బ్యాటింగ్ చేస్తున్నాడని వివరిస్తున్నారు. అయితే దీనిని హార్దిక్ అభిమానులు ఖండిస్తున్నారు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే హార్దిక్ బ్యాటింగ్ చేస్తాడని.. ఇందులో విపరీత అర్థాలకు తావు లేదని వారు వివరిస్తున్నారు.
Hardik Pandya was on fire again
The Baroda all-rounder went berserk smashing 6⃣,6⃣,6⃣,4⃣,6⃣ in an over on his way to a whirlwind 47(23) against Tripura #SMAT | @IDFCFIRSTBank
Scorecard ▶️ https://t.co/1WPFeVRTum pic.twitter.com/xhgWG63y9g
— BCCI Domestic (@BCCIdomestic) November 29, 2024