https://oktelugu.com/

170 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పొందే ఛాన్స్.. ఎలా అంటే..?

దేశంలో గత కొన్ని నెలలుగా నిత్యావసర వస్తువుల ధరలతో పాటు, పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ సిలిండర్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో గ్యాస్ సిలిండర్ ధర 870 రూపాయలకు అటూఇటుగా ఉండగా ప్రాంతాలను బట్టి గ్యాస్ సిలిండర్ ధరలలో స్వల్పంగా మార్పులు ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ ధరలు ఇప్పట్లో తగ్గే పరిస్థితులు సైతం కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో పేటీఎం యాప్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. Also Read: హోమ్ లోన్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 26, 2021 / 11:58 AM IST
    Follow us on

    దేశంలో గత కొన్ని నెలలుగా నిత్యావసర వస్తువుల ధరలతో పాటు, పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ సిలిండర్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో గ్యాస్ సిలిండర్ ధర 870 రూపాయలకు అటూఇటుగా ఉండగా ప్రాంతాలను బట్టి గ్యాస్ సిలిండర్ ధరలలో స్వల్పంగా మార్పులు ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ ధరలు ఇప్పట్లో తగ్గే పరిస్థితులు సైతం కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో పేటీఎం యాప్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది.

    Also Read: హోమ్ లోన్ తీసుకునే వారికి శుభవార్త.. 6 ఈఎంఐలు మాఫీ..?

    గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై పేటీఎం యాప్ ఏకంగా 700 రూపాయల క్యాష్ బ్యాక్ ను తీసుకొచ్చింది. పేటీఎం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ వల్ల గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది. ఈ ఆఫర్ ను వినియోగించుకోవాలంటే పేటీఎం యాప్ ను ఓపెన్ చేసి ఆ యాప్ లో రీఛార్జ్ అండ్ పే బిల్ ఆప్షన్ ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

    సిలిండర్ కంపెనీని సెలెక్ట్ చేసుకున్న తరువాత ఎల్పీజీ ఐడీ లేదా రిజిష్టర్ మొబైల్ నంబర్ ను ఎంటర్ చేసి గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకున్న తరువాత 24 గంటల్లో 700 రూపాయల విలువ చేసే స్క్రాచ్ కార్డును పొందవచ్చు. 700 రూపాయల విలువ ఉన్న స్క్రాచ్ కార్డును ఏడు రోజుల్లోగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఆఫర్ ను అందరూ పొందలేరు.

    Also Read: బంగారం ఉన్నవారికి శుభవార్త.. వడ్డీ పొందే ఛాన్స్..?

    ఎవరైతే పేటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకుంటారో వారు మాత్రమే ఈ ఆఫర్ ద్వారా క్యాష్ బ్యాక్ పొందడానికి అర్హులు అవుతారు. గ్యాస్ సిలిండర్ ధరలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆఫర్ వల్ల గ్యాస్ సిలిండర్ యూజర్లకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. మార్చి 31వ తేదీ వరకు ఈ ఆఫర్ ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకోవచ్చు. 870 రూపాయలు గ్యాస్ సిలిండర్ ధర కాగా 700 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుండటంతో కేవలం 170 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేసినట్లు అవుతుందని చెప్పవచ్చు.