టీమిండియా జోరు కొనసాగేనా..? మరికొద్ది సేపట్లో ఇంగ్లాండ్ తో రెండో వన్డే..

తిరుగులేని బ్యాటింగ్ లైనప్.. పుంజుకున్న బౌలింగ్.. మెరుగుపడిన ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో ఇంగ్లాండుతో జరిగిని తొలివన్డేలో సమష్టిగా రాణించి విజయం సాధించిన టీమిండియా మరికొద్ది సేపట్లో రెండో వన్డేకు సిద్ధం అవుతోంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇప్పటికే ఓ మ్యాచ్ లో విజయం సాధించిన భారత జట్టు రెండో వన్డేలోనూ గెలిచేసి.. సిరీస్ ను మరో మ్యాచ్ ఉండగానే సొంతం చేసుకోవాలనే పట్టుతో ఉంది. అయితే ఈ సిరీస్ నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన పరిస్థితుల్లో […]

Written By: Srinivas, Updated On : March 26, 2021 11:59 am
Follow us on


తిరుగులేని బ్యాటింగ్ లైనప్.. పుంజుకున్న బౌలింగ్.. మెరుగుపడిన ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో ఇంగ్లాండుతో జరిగిని తొలివన్డేలో సమష్టిగా రాణించి విజయం సాధించిన టీమిండియా మరికొద్ది సేపట్లో రెండో వన్డేకు సిద్ధం అవుతోంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇప్పటికే ఓ మ్యాచ్ లో విజయం సాధించిన భారత జట్టు రెండో వన్డేలోనూ గెలిచేసి.. సిరీస్ ను మరో మ్యాచ్ ఉండగానే సొంతం చేసుకోవాలనే పట్టుతో ఉంది. అయితే ఈ సిరీస్ నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన పరిస్థితుల్లో ప్రపంచ చాంపియన్ ఇంగ్లాండును తేలిగ్గా తీసుకోకూడదని కోహ్లీసేన భావిస్తోంది.

బ్యాటింగ్ పరంగా టీమిండియాకు తిరుగులేదు. తొలివన్డేలో ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ ఫాంలోకి రావడం శుభపరిణామం. అతడితో పాటు మరో ఓపెనర్ రోహిత్ శర్మ, కెప్టెన్ కోహ్లీతో కూడిన టాపార్డర్ చాలా పటిష్టంగా ఉంది. తొలి వన్డేలో కోహ్లీ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గరురిలో ఏ ఒక్కరు మైదానంలో తమ బ్యాటును ఝులిపించినా.. భారత్ కు మరోసారి భారీస్కోరు ఖాయం.

ఇక తొలివన్డేలో గాయం కారణంగా జట్టుకు దూరం అయిన శ్రేయస్ స్థానంలో సూర్యకుమార్ కు అవకాశం దక్కే చాన్స్ ఉంది. ఇంగ్లాండ్ తో టీ20లో గొప్పగా రాణించిన అతడిని వన్డేలోనూ తీసుకోవాలనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అదే విధంగా పంత్ ను కూడా ప్రత్యేక బ్యాట్స్ మెన్ గా జట్టులోకి తీసుకునే అవకాశాలను తీసి పారేయలేం. ఎవరు తుదిజట్టులోకి వచ్చినా.. మిడిలార్డర్లో కీలక ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. రాహుల్ కూడా బ్యాటింగ్ లయ అందుకోవడం జట్టుకు శుభపరిణామం. గత వన్డేతో ఫార్మర్ట్ లో అడుగుపెట్టిన కృనాల్ పాండ్య ధనాధన్ ఇన్నింగ్స్ తో తనదైన ముద్రవేశాడు. అతడితో పాటు హార్థిక్ పాండ్య దూకుడు ప్రదర్శిస్తే.. తిరుగుఉండదు.

బౌలింగ్ విషయంలో బూమ్రా.. షమీ లేనప్పటికీ.. భువనేశ్వర్ అనుభవంతో పాటు శార్ధుల్ వైవిద్యం, ప్రసిద్ధ్ కృష్ణ మెరుపులు కలిసివచ్చాయి. వరుసగా మ్యాచ్ లు అడుతున్న శార్థుల్ కు విశ్రాంతినిచ్చి నటరాజన్ లేదా సిరాజ్ కు జట్టులో స్థానం కల్పించే అవకాశం ఉంది. అయితే జట్టును స్పిన్ కలవరపెడుతోంది. గతమ్యాచ్ లో కుల్దీప్ ఆకట్టుకోలేకపోయాడు. అతడి స్థానంలో చాహల్ ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ జట్టులోనూ ఆటగాళ్లు అందరూ సమష్టిగా రాణిస్తున్నారు. బౌలింగ్ కొతమేర ఇబ్బంది కలిగిస్తోంది.