Sai Dharma Tej Accident: బైక్ రేసింగ్, మూర్ఛ, సాయిధరమ్ యాక్సిడెంట్ పై అనుమానాలు?

Sai Dharma Tej Accident: టాలీవుడ్ యంగ్ హీరో, చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు గురికావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సీసీ టీవీ ఫుటేజ్ చూస్తే సాయిధరమ్ పెద్దగా స్పీడు ఏమీ లేడని తెలుస్తోంది. కొంచెం వేగంతో నార్మల్ స్పీడులోనే వెళ్లాడని తెలుస్తోంది. కానీ అక్కడ ఇసుక, మట్టిపై నుంచి వెళుతూ స్కిడ్ అయి పడ్డాడని రహదారిపై ఆనవాళ్లు చూస్తే అర్థమవుతోంది. అయితే సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాలో బోలెడు కథనాలు […]

Written By: NARESH, Updated On : September 11, 2021 12:22 pm
Follow us on

Sai Dharma Tej Accident: టాలీవుడ్ యంగ్ హీరో, చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు గురికావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సీసీ టీవీ ఫుటేజ్ చూస్తే సాయిధరమ్ పెద్దగా స్పీడు ఏమీ లేడని తెలుస్తోంది. కొంచెం వేగంతో నార్మల్ స్పీడులోనే వెళ్లాడని తెలుస్తోంది. కానీ అక్కడ ఇసుక, మట్టిపై నుంచి వెళుతూ స్కిడ్ అయి పడ్డాడని రహదారిపై ఆనవాళ్లు చూస్తే అర్థమవుతోంది.

అయితే సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాలో బోలెడు కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ యంగ్ హీరోలు అంతా కలిసి వీకెండ్ బైక్ పై రేసింగ్ చేస్తారని.. సుదూరంగా ప్రయత్నిస్తారని అంటున్నారు. ప్రధానంగా యంగ్ హీరో సందీప్ కిషన్ తో పాటు మరో ఇద్దరు హీరోలతో కలిసి సాయిధరమ్ స్పోర్ట్స్ బైక్ లపై లాంగ్ డ్రైవ్ కు వెళతారని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ఈ క్రమంలోనే ఈ శుక్రవారం కూడా హీరోలు వెళ్లారని.. ఇదే క్రమంలో సాయిధరమ్ తేజ్ మాదాపూర్ తీగల వంతెనపై ఇసుక, మట్టి కారణంగా స్కిడ్ అయ్యిపడిపోయాడని మీడియాలో చెబుతున్నారు. సాయిధరమ్ తేజ్ ప్రమాదం తెలియగానే పరామర్శకు వచ్చిన హీరోల్లో సందీప్ కిషన్ కూడా ఉండడం ఇక్కడ అనుమానాలు బలపడేలా చేస్తోందని అంటున్నారు.

ఇక మరో విషయం కూడా ప్రచారమవుతోంది. సాయిధరమ్ తేజ్ అంత స్పీడుగా ఏం పోలేదని.. బైక్ పై వెళుతుంటే మూర్చ వచ్చిందని.. అందుకే పడ్డాడని ప్రధాన మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. సాయిధరమ్ తేజ్ కు మూర్చ ఉందని ప్రచారం సాగుతోంది. ఇది నిజమా? కాదా? అన్నది తెలియాల్సి ఉంది.

అయితే ఈ వార్తలపై అటు మెగా ఫ్యామిలీ కానీ.. ఇటు సాయిధరమ్ తేజ్ కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతానికి ఇదొక ప్రమాదంగానే భావిస్తున్నారు. మీడియాలో రకరకాలుగా జరుగుతున్న ప్రచారంపై మెగా ఫ్యామిలీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. లేకుంటే ఈ ప్రచారం మరింత ఎక్కువయ్యేలా ఉంది.