Ford F 150: కొత్త ఏడాది ప్రారంభమై నెల రోజులు కావస్తోంది. కార్ల తయారీ సంస్థలు తమ మార్కెట్‌ను నిలబెట్టుకునేందుకు లేటెస్ట్ వెర్షన్స్ విడుదల చేస్తున్నాయి. భారతీయ కంపెనీలు కూడా అంతర్జాతీయ మోటార్ సంస్థలతో పోటీ పడుతున్నాయి. ఈ రేసులో 2026లో ప్రపంచంలోనే ఎక్కువ అత్యంత విక్రయాలు చేసిన పికప్ ట్రక్‌గా 2026 ఫోర్డ్ F–150 నిలిచింది. అన్నివర్గాలకు అనుకూలంగా ఉండే ఈ మోడల్ డిజైన్, టెక్నాలజీ, పనితీరు, సౌకర్యాలో లుక్ అదిరిపోయింది.
ఔట్ఫిట్ లుక్..
అధునాతన ఎల్ఈడీ హెడ్లైట్లు, స్ట్రాంగ్ బాడీని తలపించే డిజైన్ F-150 కు కొత్త లుక్ తెచ్చాయి. కొత్త వీల్ డిజైన్లు అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఇక లోపల విశాలమైన క్యాబిన్లో ముందు–వెనుక సీట్లకు తగిన లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ ఉన్నాయి. ప్రీమియం మెటీరియల్స్ లాంగ్ జన్నీని సుఖవంతం చేస్తుంది. టూల్స్, వస్తువులకు సమర్థవంతమైన స్టోరేజ్ ఏర్పాటు చేశారు.
అధునాతన టెక్నాలజీ..
పెద్ద టచ్‌స్క్రీన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో టెక్ ప్రేమికులను ఆకర్షిస్తుంది. వాయిస్ కమాండ్స్, నావిగేషన్, వైర్లెస్ చార్జింగ్ ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. రెస్పాన్సివ్ ఇంటర్ఫేస్తో ఉపయోగించడం సులభం.
హై పవర్ ఇంజిన్..
వివిధ ఇంజన్లు రోజువారీ ఉపయోగం నుంచి భారీ పనులకు సరిపోతాయి. అధిక టోయింగ్, హాలింగ్ సామర్థ్యంతో నిర్మాణం, వ్యవసాయం, ఆడ్వెంచర్లకు అనువు. మెరుగైన సస్పెన్షన్‌తో రఫ్ రోడ్లలోనూ స్థిరంగా సాగుతుంది. హైవేలు, నగర రోడ్లలో సులభంగా హ్యాండిల్ అవుతుంది. ట్రైలర్ టోయింగ్లోనూ ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది.
ప్రయాణం భద్రంగా..
ఆటో బ్రేకింగ్, లేన్ కీపింగ్, 360–డిగ్రీ కెమెరాలు రోడ్డు భద్రతను పెంచుతాయి. బాడీ నిర్మాణం, అడ్వాన్స్డ్ సెన్సార్లతో ప్రయాణికులకు భరోసా ఇస్తుంది. బేసిక్ వర్క్ మోడల్ నుంచి లగ్జరీ వెర్షన్ల వరకు ట్రిమ్‌లు లభిస్తాయి. ఫీచర్లు, ఇంటీరియర్, టెక్ ప్యాకేజీలతో బడ్జెట్, జీవనశైలికి తగ్గట్టు మార్చుకోవచ్చు.
శక్తి, సౌకర్యం, టెక్నాలజీ కలగలిపిన F–150 పికప్ మార్కెట్లో ముందంజలో నిలుస్తుంది. పని, కుటుంబం, వినోదానికి సర్దుబాటు అవుతుంది.