MLA Danam Nagender: తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలలో ఏడుగురికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విషయం తేల్చాల్సి ఉంది. ఫిరాయింపులపై ఇదే లాస్ట్ ఛాన్స్ అని సుప్రీం కోర్టు ఇప్పటికే డెడ్‌లైన్ విధించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ముగ్గురి లెక్క తేల్చే పనిలో పడ్డారు స్పీకర్.
దానంకు నోటీసులు..
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు స్పీకర్ ఈసారి కఠినమైన నోటీసుల జారీ చేశారు. ఏది ఏమైనా ఈనెల 30లోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. పార్టీ ఫిరాయింపులపై వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. లేదంటే పార్టీ ఫిరాయించినట్లుగానే పరిగణించాల్సి ఉంటుందని పరోక్షంగా చెప్పారు. తాజా నోటీసులు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
నోటీసులో ఏముంది..
స్పీకర్ తీర్మానం ప్రకారం, దానం నాగేందర్‌ను ఈ నెల 30 తేదీన విచారణకు కట్టుబడి హాజరు కావాలి. లేదంటే ఇది సభా నియమాల ఉల్లంఘనలకు సంబంధించిన చర్యగా కనిపిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకే దానం నాగేందర్‌కు నోటీసులు పంపినట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పైచేయి సాధించింది. మున్సిపల్ ఎన్నికల్లోనూ సాధిస్తామన్న ధీమాతో ఉంది. ఆ నమ్మకంతోనే దానంతో రాజీనామా చేయించే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తరహాలో దానంతో కాంగ్రెస్ టికెట్‌పై మళ్లీ పోటీ చేయించాలన్న ఆలోచన ఉన్నట్లు సమాచాం.
విచారణకు వస్తే దొరికపోవుడే..
ఇక దానం విచారణకు వస్తే అడ్డంగా దొరికిపోతారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచిన దానం.. లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేకుండానే కాంగ్రెస్ టికెట్‌పై సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ మరో పార్టీ టికెట్‌పై పోటీ చేడయడం పార్టీ ఫిరాయింపు కిందకే వస్తుంది. దీంతో విచారణలో తాను బీఆర్‌ఎస్‌లో ఉన్నానని చెప్పి తప్పించుకునే అవకాశం లేదు.
అన్నింటికీ సిద్ధపడే..
సుప్రీం కోర్టు డెడ్‌లైన్ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, కాంగ్రెస్ అధిష్టానం అన్నింటికి సిద్దపడ్డట్లు తెలుస్తోంది. మొదట దానంపై అనర్హత వేటు వేయకుండానే రాజీనామా చేయించే ఆలోచనలో ఉంది. స్పీకర్ నోటీసుల నేపథ్యంలో దానం రేపో మాపో రాజీనామా చేసే అవకాశం ఉంది. దీంతో మరో ఆరు నెలల్లో ఖైతాబాద్‌కు ఉప ఎన్నికలు రానున్నాయి. ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.