Honda SP 125: రోజువారి అవసరాలతో పాటు.. స్టైలిష్ గా డ్రైవ్ చేయాలని అనుకునేవారు Honda కంపెనీకి చెందిన బైక్స్ ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. యూత్ తో పాటు వినియోగదారులకు అనుగుణంగా కూడా ఈ కంపెనీ లేటెస్ట్ డిజైన్తో పాటు డిఫరెంట్ లుక్ ను ఇచ్చే బైక్స్ ను ప్రవేశపెడుతుంది. 2026 సంవత్సరంలో కొత్తగా హోండా కంపెనీ SP 125 పేరుతో కొత్త వాహనాన్ని ప్రవేశపెట్టింది. ఇది నగర ప్రయాణికులతో పాటు లాంగ్ డ్రైవ్ చేసేవారికి అనుగుణంగా ఉంటుంది. ఎలాంటి అలసట లేకుండా డ్రైవ్ చేసేందుకు సపోర్ట్ చేస్తుంది. ఫ్యామిలీ సభ్యులు సైతం దీనిపై ప్రయాణం చేసి ఇంధనం ఖర్చులను సేవ్ చేసుకోవచ్చు. ఈ బైక్ పూర్తి వివరాల్లోకి వెళితే..
Honda SP 125 బైక్ డిజైన్ విభిన్నంగా ఉంటూ యూత్ ను ఆకర్షిస్తుంది. గ్రాఫిక్స్ తో కూడిన మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంకు ఉండడంతో దీనిపై కూర్చున్నప్పుడు ప్రత్యేకంగా కనిపిస్తారు. అలాగే మెరుగైన LED హెడ్ లాంప్స్, స్టైలిష్ గా ఉండే అల్లాయి వీల్స్ టెంప్ట్ చేస్తాయి. ఈ బైక్ మొత్తం ఎర్గోనామిక్ డిజైన్లు కలిగి ఉండడంతో సిటీలో ఉండే వారికి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. లాంగ్ డ్రైవ్ చేసేవారికి ఎలాంటి అలసట లేకుండా ఉంటుంది.
ఈ కొత్త బైక్ లో ఉండే ఇంజన్ రోజువారి వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది. ఇందులో 124 సిసి సింగిల్ సిలిండర్ ను అమర్చారు. ఇది ఎయిర్ coold ఇంజన్ కావడంతో స్థిరమైన పనితీరును అందిస్తుంది. తరచుగా గేర్లు మార్చినా కూడా ప్రయాణం సులభతరం చేస్తుంది.5 స్పీడ్ గేర్ బాక్స్ తో పనిచేసే ఈ బైక్ లీటర్ ఇంధనానికి 60 నుంచి 65 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. మధ్యతరగతి ప్రజలకు ఈ మైలేజ్ బాగా సరిపోయే అవకాశం ఉంది.
అయితే లాంగ్ డ్రైవ్ చేసే వారికి కూడా ఈ బైక్ అనుగుణంగా ఉంటుంది. దీనిపై ఉండే సీటింగ్ తో నిటారుగా కూర్చునే అవకాశం ఉంటుంది. టెలిస్కోప్ ఫ్రంట్ పోర్క్, సస్పెన్షన్ సెటప్ వంటివి ఎలాంటి రోడ్లపై ప్రయాణించినా అలసట లేకుండా ఉంటుంది. బైకు ఉండే హ్యాండిల్స్ నగరాల్లో ప్రయాణించే వారికి లుక్ ను తీసుకొస్తుంది. ఈ బైక్లో లేటెస్ట్ టెక్నాలజీ తో కూడిన ఫీచర్లను అమర్చారు. ఇందులో ట్రిప్ మీటర్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంధన గేజ్ వంటివి చేర్చారు. ఎల్ఈడి లైటింగ్, ఎలక్ట్రిక్ స్టార్ట్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఉన్నాయి. సేఫ్టీ విషయంలో ఈ బైక్ నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో నమ్మకమైన బ్రేకింగ్ తో పాటు, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అమర్చారు. అలాగే కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టం కూడా సేఫ్టీని అందిస్తుంది.
మార్కెట్లో దీనిని రూ.75,000 ప్రారంభ ధర నుంచి విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ ధర రూ.85,000 వరకు ఉంది. మధ్యతరగతి ప్రజలకు మైలేజ్ ఎక్కువగా ఉండడంతో పాటు తక్కువ ధరలో బైక్ కొనాలని అనుకునేవారు ఇది బెస్ట్ ఎంపిక అని అంటున్నారు.