Ravi Teja Irumudi Movie Updates: వరుస డిజాస్టర్ ఫ్లాప్ సినిమాల తర్వాత మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja) నేటి తరం ఆడియన్స్ కి తగ్గ సినిమాలు చెయ్యాలని ఫిక్స్ అయ్యి, డిఫరెంట్ జానర్ సినిమాలను ఒప్పుకుంటున్నాడు. అందులో భాగంగా ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ని తెరకెక్కించిన శివ నిర్వాణ తో ‘ఇరుముడి'(Irumudi Movie) అనే చిత్రం చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని రవితేజ పుట్టిన రోజు సందర్భంగా జనవరి 26 న విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ కి అభిమానుల నుండి , ఆడియన్స్ నుండి ఇంతకు ముందు ఏ రవితేజ సినిమా ఫస్ట్ లుక్ కి కూడా రానంత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రవితేజ రొటీన్ కమర్షియల్ సినిమాల ఊబి నుండి బయటకు వచ్చి నేటి తరం ఆడియన్స్ కి తగ్గ సినిమాలు చేస్తున్నందుకు సంతోషంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ఫస్ట్ లో రవితేజ అయ్యప్ప మాల ధరించి, తన కూతురుని దేవుడి ముందు ఎత్తుకోవడం చాలా కొత్తగా అనిపించింది. ఎంతసేపు ఫైటింగులు, హీరోయిన్ పక్కన చిందులేసే రవితేజ లో ఈ కొత్త కోణం ఆడియన్స్ ని ఆకర్షించింది. ఇది ఒక తండ్రి,కూతురు మధ్య జరిగే భావోద్వేగ పూరిత ఎమోషన్స్ ఉన్న సినిమా అని తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం మలయాళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘మాలికాపురం’ కి రీమేక్ గా తెరకెక్కుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ‘మార్కో’ ఫేమ్ ఉన్ని ముకుందన్ హీరో గా నటించిన ఈ చిత్రం 2022 వ సంవత్సరం లో విడుదలై సూపర్ హిట్ గా నిల్చింది. ఇందులో హీరో వేషధారణ, ఆయనతో పాటు ఒక అమ్మాయి ఉండడం చూసి, ‘ఇరుముడి’ కచ్చితంగా ఆ చిత్రానికి రీమేక్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
దీనిపై అధికారికంగా ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు. ‘మాలికాపురం’ చిత్రం జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్ లో కూడా ఈ చిత్రాన్ని చూడొచ్చు. ఒకవేళ ఆ చిత్రానికి రీమేక్ గా ‘ఇరుముడి’ తెరకెక్కితే మాత్రం రవితేజ ఖాతాలో మరో ఫ్లాప్ పడినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాని నెటిజెన్స్ అత్యధిక శాతం వీక్షించేసారు. ఒకసారి ఓటీటీ లో చూసిన సినిమాని మళ్లీ వెండితెర పై డబ్బులు పెట్టి చూడాలంటే ప్రేక్షకుడికి కష్టమే. మరి రీమేక్ వార్తల్లో ఎంత నిజముందో చూడాలి మరి. సోషల్ మీడియా లో ఈ వార్త బాగా వైరల్ అయ్యింది కాబట్టి, మేకర్స్ ఈ అంశంపై స్పష్టత ఇస్తే మంచిది అంటూ సోషల్ మీడియా లో రవితేజ అభిమానులు కోరుతున్నారు.