2026 Kia Camper Van: కాలం మారుతున్న కొద్ది కార్లు కొనే వారి అభిరుచులు మారిపోతున్నాయి. కంపెనీలు సైతం వినియోగదారులకు అనుగుణంగా కొత్త కొత్త మోడల్స్ను ప్రవేశపెడుతున్నాయి. ఇందులో భాగంగా దక్షిణ కొరియా కంపెనీ Kia నుంచి ఇప్పటికే ఆకట్టుకునే వెహికల్స్ వినియోగదారులకు చేరాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మినీ వ్యాన్ వలే ఉన్న ఓ కారు ఆకర్షిస్తుంది. ఇది ఉమ్మడి కుటుంబ ప్రయాణికుల కోసం.. అలాగే లగ్జరీ లైఫ్ అనుభవించేవారు విశ్రాంతి తీసుకోవడానికి దీనిని ఉపయోగించుకోవచ్చు. లాంగ్ డ్రైవ్ చేసే సమయంలో ఇందులో ప్రయాణం చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వినూత్న డిజైన్తోపాటు లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన ఈ కారు గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Kia కంపెనీ నుంచి Camper Van మార్కెట్లో ప్రత్యేకంగా నిలుస్తుంది. లగ్జరీ కారు కొనేవారు దీని డిజైన్ చూసి ఇంప్రెస్ అవుతున్నారు. ఇటీవల వరల్డ్ వైస్ గా లగ్జరీ వాహనాలకు డిమాండ్ పెరిగిపోతుంది. యూర ప్ దేశాల్లో ఇలాంటి వాహనాలు మిగతా వాటి కంటే 10% ఎక్కువగా అమ్ముడు అవుతున్నాయి. వీకెండ్ టూర్, ఏకాగ్రత కోరుకునే ప్రయాణికుల కోసం ఈ కారు సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ కారు 4695 ఎంఎం పొడవు, 1895 ఎంఎం వెడల్పు, 1899 ఎంఎం ఎత్తు ఉండి విశాలమైన ఒక గది వలె తలపిస్తుంది. ఏ ప్రాంతానికి వెళ్లిన ఇందులో నివసిస్తే ఆ అనుభూతే వేరుగా అనిపిస్తుంది.
ఈ వాహనంలో బలమైన బ్యాటరీని అమర్చారు. ఇందులో ఉండే బ్యాటరీ 71.2 కిలో వాట్ తో పనిచేస్తుంది. దీనిని 30 నిమిషాల పాటు చార్జింగ్ చేస్తే పది నుంచి 80 శాతం వరకు చార్జ్ అవుతుంది. వేగవంతంగా చార్జింగ్ అయి సమయం వృధా కాకుండా చూస్తుంది. ఒకసారి చార్జింగ్ చేస్తే 400 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. లాంగ్ టూర్ వేసిన సమయంలో చార్జింగ్ సదుపాయం అద్భుతం అని అనిపిస్తుంది.
కియా క్యాంపర్ కొత్త వ్యాన్ లో ఫీచర్స్ లేటెస్ట్ టెక్నాలజీ తో అమర్చారు. ఇందులో రిఫ్రిజిరేటర్, మైక్రోవేవ్, వైన్స్ సెల్లార్ ఉన్నాయి. దీంతో ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లు అనిపిస్తుంది. అలాగే ఆఫ్ గ్రిడ్ ఉపయోగం కోసం ఏఐ ఆధారిత ఎల్జి పరికరాలను చేర్చారు. వీటిలో భాగంగా మొబైల్ ఛార్జింగ్ టీవీ వంటివి కూడా ఉంటాయి. మాడ్యులర్ సీటింగ్, స్మార్ట్ కిచెన్, సోలార్ ప్యానల్ ఉండడంతో పాటు ఫ్లెక్సీబుల్ స్లీపింగ్ ఏరియాలో ఉంటాయి. అడ్వెంచర్ రెడీ సెటప్ కోసం ఈ వాహనం ప్రత్యేకంగా నిలుస్తుంది.
విన్న రీతిలో ఉన్న కియా క్యాంపర్ వ్యాన్ ధర 65000 డాలర్ నుంచి 68,000 డాలర్ వరకు విక్రయించే అవకాశం ఉంది. 2026 వేసవిలో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే భారత్ లోకి ఇది వస్తుందా? లేదా? అనేది ఇంకా తెలియ రాలేదు.