Nasalspray: ఊపిరి పీల్చుకోండి.. కరోనా వైరస్ పై కొత్త అస్త్రం.. తొలి నాసల్ స్ప్రే విడుదల

Nasalspray: కరోనా వైరస్ రెండేళ్లుగా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికీ రూపాంతరాలు చెందుతూ కొత్త కొత్త వేరియంట్ లుగా మారింది ప్రజలపై అటాక్ చేస్తోంది. ఇప్పటికీ దీనికి మందులు కనిపెట్టలేకపోయారు. నివారణ లేని ఈ వ్యాధికి కరోనా టీకా ఒక్కటే ముందస్తు మందు. దాన్ని వేసుకొని ప్రజలంతా రక్షణ పొందుతున్నారు. అయితే తాజాగా ప్రజలకు ఊరటనిచ్చేలా కొత్త మందు అందుబాటులోకి వచ్చింది. పరిశోధన ద్వారా ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలో ముందుంటే ‘గ్లెన్ మార్క్ పార్మా’ తాజాగా […]

Written By: NARESH, Updated On : February 9, 2022 3:13 pm
Follow us on

Nasalspray: కరోనా వైరస్ రెండేళ్లుగా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికీ రూపాంతరాలు చెందుతూ కొత్త కొత్త వేరియంట్ లుగా మారింది ప్రజలపై అటాక్ చేస్తోంది. ఇప్పటికీ దీనికి మందులు కనిపెట్టలేకపోయారు. నివారణ లేని ఈ వ్యాధికి కరోనా టీకా ఒక్కటే ముందస్తు మందు. దాన్ని వేసుకొని ప్రజలంతా రక్షణ పొందుతున్నారు. అయితే తాజాగా ప్రజలకు ఊరటనిచ్చేలా కొత్త మందు అందుబాటులోకి వచ్చింది.

పరిశోధన ద్వారా ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలో ముందుంటే ‘గ్లెన్ మార్క్ పార్మా’ తాజాగా కరోనా చికిత్స కోసం సరికొత్త ఔషధాన్ని ఆవిష్కరించింది. ఇప్పటికే ‘గ్లెన్ మార్క్ ఫార్మా’ ‘ఫాబిఫ్లూ’ అనే యాంటీ వైరల్ ఔషధాన్ని అన్ని కంపెనీల కంటే ముందుగానే రోగులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు తాజాగా ‘ఫ్యాబి స్ప్రే’ పేరుతో నాసల్ స్ప్రేను విడుదల చేసి కరోనా రోగులకు గొప్ప ఉపశమనం అందించింది. దీనికి భారత ఔషధ నియంత్రణ మండలి తాజాగా ఆమోదం తెలుపడంతో ఇది కరోనా రోగులకు ఊపిరినిచ్చినట్టైంది.

ఈ నాసల్ స్ప్రేలో ‘నైట్రిక్ అక్సైడ్’ ఉంటుంది. కరోనా వైరస్ లోడ్ ను తగ్గించడంలో మంచి ఫలితాలను ఈ స్ప్రే ఇస్తున్నట్టు గ్లెన్ మార్క్ ఫార్మా చెబుతోంది. ఫేస్ 3 పరీక్షల్లో వైరల్ లోడ్ ను 24 గంటలలో 94 శాతం మేర.. 48 గంటల్లో 99 శాతం మేర తగ్గిస్తున్నట్లు తేలింది. ఈ నాసల్ స్ప్రే సురక్షితమైనదని సంస్థ ప్రకటించింది.

ఈ స్ప్రేను ముక్కులో కొట్టుకుంటే శ్వాస వ్యవస్థలోకి వెళ్లకుండా వైరస్ ను అడ్డుకుంటుందని గ్లెన్ మార్క్ అంటోంది. శ్వాస కోస వ్యవస్థ ఎగువ భాగంలోనే వైరస్ ను చంపేసే లక్ష్యంతో ఈ ఫ్యాబి స్ప్రేను అభివృద్ధి చేశారు. దీనియి యాంటీ మైక్రోబయల్ ప్రాపర్టీస్ ఉన్నట్టు రుజువైంది.

ఈ స్ప్రే ద్వారా కరోనా వైరస్ కణాలను ఉత్పత్తి చేసుకోకుండా.. ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది అని గ్లెన్ మార్క్ సంస్థ తెలిపింది.