Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యువ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. అయితే తాజాగా ఓ ప్రముఖ రియల్-ఎస్టేట్ సంస్థ చిరును తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండమని కోరడంతో ఆయన ఒప్పుకున్నారట. ఇందుకోసం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని, ఈ మేరకు ఒప్పందం కూడా కుదిరిందని సమాచారం. రియల్-ఎస్టేట్ సంస్థ పనితీరు నచ్చడంతోనే చిరు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు ఓకే చెప్పారట.

మొత్తానికి ప్రకటనల్లోనూ రీఎంట్రీ ఇవ్వడానికి బాగా ఉత్సాహంగా ఉన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. మెగాస్టార్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. కొరటాల శివతో ఆచార్య, మెహర్ రమేష్ తో ‘భోళా శంకర్’, మోహన్ రాజాతో ‘గాడ్ ఫాదర్’, అలాగే బాబీతో మరో సినిమా, వెంకీ కుడుములతో మరో సినిమా.. ఇలా చిరంజీవి సినిమాల లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. చిరంజీవి ఇలా వరుస సినిమాలు ఒప్పుకోవడానికి ముఖ్య కారణం.. ఇక హీరోగా మరో నాలుగేళ్ళు మాత్రమే సినిమాలు చేయాలని చిరు నిర్ణయించుకున్నారు.
Also Read: మంత్రి సిదిరి అప్పలరాజుకు శారదా పీఠం వద్ద ఘోర పరాభవం
అందుకే ఈ నాలుగేళ్ళల్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే, ఈ సినిమాల మొత్తంలో ఓ సినిమా పై మాత్రం ఇండస్ట్రీలో తెగ చర్చ జరుగుతుంది. ఆ సినిమానే ‘వేదాళం’ రీమేక్ ‘భోళా శంకర్’. ఎందుకంటే.. మెగాస్టార్ తన కెరీర్ లోనే ‘భోళా శంకర్’ కోసం పూర్తి డిఫరెంట్ క్యారెక్టర్ లో విభిన్న లుక్ లో కనిపించనున్నాడు. ఆ మధ్య చిరు పూర్తి గుండు లుక్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

ఆ లుక్ ఈ సినిమాలోనిదే. అయితే, ఆ లుక్ దాదాపు ముప్పై నిముషాలు ఉంటుంది. నిజంగా ఇది షాకింగ్ విషయమే. మెగాస్టార్ డీ గ్లామర్ లుక్ లో.. అదీ ఒక గుండు లుక్ లో దాదాపు పది సీన్స్ లో కనిపించడం అంటే.. షాకింగ్ విషయమే. పైగా ఈ లుక్ కోసం చిరు దాదాపు రెండు గంటల పాటు కదలకుండా మేకప్ వేసుకుంటున్నారు.
Also Read: రోజుకు నాలుగు జీడిపప్పులు తింటే ఆ సమస్యలకు చెక్.. ఊహించని బెనిఫిట్స్?
[…] Also Read: వాటిల్లో కూడా మెగాస్టార్ రీఎంట్రీ ఖర… […]
[…] Also Read: వాటిల్లో కూడా మెగాస్టార్ రీఎంట్రీ ఖర… […]