Smartphone Prices: ప్రస్తుతం ప్రతిరంగంలోArtificial Intelligence (AI) ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే ఏఐ కారణంగా అనేక మార్పులు వచ్చాయి. కొంతమంది దీంతో ఉద్యోగాలు కోల్పోతుండగా.. మరి కొన్ని కంపెనీలు మాత్రం తమ పని సులువుగా మారిందని.. భవిష్యత్తులో ప్రతి అవసరానికి ఏఐ ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇప్పుడు ఫోన్ తయారీలో కూడా ఏఐ అవసరం పడింది. సెమీ కండక్టర్ సరపరదారులు ఏఐ కోసం వినియోగించే అధునాతన చిప్స్ పై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలో మెయిన్ స్ట్రీమ్ ఉత్పత్తుల కోసం ఉపయోగించే మెమొరీ మాడ్యూల్ సరఫరాలను తగ్గించారు. దీంతో మొబైల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే ఏ మొబైల్ ఎంత పెరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం.
కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. 2025 చివరి సంవత్సరం… 2026 ప్రారంభంలో మొబైల్స్ ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుపుతోంది. ఈ ఏడాదిలో 30%.. వచ్చే ఏడాదిలో 20% పెరగనున్నట్లు అంచనా వేసింది. అయితే ఇప్పటికే ఈ ఏడాదిలో 50% మొబైల్ ధరలు పెరిగాయి. ఇప్పుడు మరోసారి ధరలు పెంచనున్నారు. స్మార్ట్ ఫోన్ తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల్లో డేటా నిల్వల కోసం ఉపయోగించే స్టోరేజ్ మాడ్యూల్స్ ధరలు 20 నుంచి 60% వరకు పెరిగాయి దీంతో 1 టీబీ స్టోరేజ్ ఉండే మాడ్యూల్ కు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ క్రమంలో దీనిని ఉత్పత్తి చేసే పరిశ్రమ పాత టెక్నాలజీని తీసేస్తోంది. ఈ క్రమంలో 512 GB మాడ్యూల్స్ ధరలు 65% పెరిగాయి. దీంతోపాటు 256 జీబీ మాడ్యూల్స్ ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో హై స్పీడ్ డేటా నిల్వ కోసం ఉపయోగించే డైనమిక్ రామ్ ధరలు కూడా పెరనున్నాయి. ఇవి 18 నుంచి 20% పెరిగే అవకాశం ఉంది. వీటి ధరలు పెరగడంతో స్మార్ట్ ఫోన్లు తయారు చేసే బడ్జెట్ పై ప్రభావం పడుతుంది. ఈ బడ్జెట్ ను కవర్ చేసుకునేందుకు ధరలు పెంచనున్నారు.
వీటిలో ముఖ్యంగా వివో, Oppo, Realme వంటి స్మార్ట్ ఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. వీటి ధరలు రూ.500 నుంచి రూ.2,000 వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే 2026 రెండో త్రైమాసికంలోనూ ఫోన్ల ధరలు పెరగవచ్చని అంటున్నారు. స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాకుండా డిస్క్ టాప్ కంప్యూటర్లు, స్టోరేజ్ మాడ్యూల్స్ ఉపయోగించే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు 15 నుంచి 20% పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.