FD Rates: ఎఫ్డీలపై ఏఏ బ్యాంకులు ఎంత వడ్డీ ఇస్తున్నాయి.. అందులో టాప్ బ్యాంకులు ఏంటి?

ఏది ఏమైనా అనేక బ్యాంకులు ఎఫ్డీలను అందిస్తున్నందున, ఏవి ఉత్తమ రాబడిని అందిస్తాయో నిర్ణయించడం సవాలు. సంవత్సరం, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల కాలపరిమితికి టాప్ 5 బ్యాంక్ ఎఫ్డీ జాబితా కింద ఇవ్వబడింది.

Written By: Mahi, Updated On : October 22, 2024 3:21 pm

FD Rates

Follow us on

FD Rates: పొదువు అనేది ప్రతీ జీవి జీవన సైకిల్ లో ముఖ్యమైన అంశం అంటే ఒప్పుకొని తీరాల్సిందే. ఒక్క మనుషులకే కాదు.. చీమ నుంచి ఏనుగు వరకు అవసరం. కానీ వాటి వాటి బుద్ధి దృశ్యా చేసుకోవాలా? వద్దా? అనేది వాటి ఇష్టం. చీమలను తీసుకోండి.. వానాకాలం బయటకు రావడం కుదరదు. అందుకే మిగిలిన రెండు కాలాల పాటు అందిన కాడికి కూడ బెట్టుకుంటుంది. అలాగే ఎలుగుబంటి కూడా సుప్తావస్తకు వెళ్లే ముందు ఎక్కువగా తిని కొవ్వు రూపంలో ఒంట్లో నిల్వ ఉంచుకుంటుంది. ఇది వాటి జీవన గమనానికి తోడ్పడుతుంది. మరి మనిషి బతికేందుకు కావాల్సింది డబ్బు. జీవులకు ఆహారం ఎంత అవసరమో మనిషి కూడా బతికేందుకు డబ్బు అంతే అవసరం. వాటిని పొదుపు చేసుకొని ఫిక్స్ డ్ డిపాజిట్ చేసుకుంటే బతుకు ఆర్థికంగా ఆనందంగా ఉంటుంది. అయితే డబ్బు నిల్వ ఉంటే ఏదీ కాదు. అందుకు బ్యాకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే ఎంతో కొంత వడ్డీ వస్తుంది. ఏఏ బ్యాంకులు ఎంతెంత వడ్డీని ఇస్తున్నాయన్నది తెలుసుకుందాం. ఏ బ్యాంకులు ఉత్తమ ఎఫ్డీ రేట్లను అందిస్తున్నాయి? అందులో టాప్ 5 బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్లు ఏవి? బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్లు లేదా ఎఫ్డీలు రిస్క్ లేని పెట్టుబడిదారులకు అనుకూలమైన పెట్టుబడి ఎంపిక. ఆర్బీఐ రేట్లను తగ్గించే ముందు ఫిక్స్ డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టేందుకు ప్రస్తుత అధిక వడ్డీ రేటు వాతావరణం అనువైన సమయం కావచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

ఏది ఏమైనా అనేక బ్యాంకులు ఎఫ్డీలను అందిస్తున్నందున, ఏవి ఉత్తమ రాబడిని అందిస్తాయో నిర్ణయించడం సవాలు. సంవత్సరం, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల కాలపరిమితికి టాప్ 5 బ్యాంక్ ఎఫ్డీ జాబితా కింద ఇవ్వబడింది. అదనంగా, ఈ ఫిక్స్ డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టినప్పుడు మీ పెట్టుబడి రూ. 10,000 అనుకున్నట్లయితే ఏఏ బ్యాంకులు ఎంత చెల్లిస్తాయన్న విషయాన్ని వివరించే ప్రయత్నం చేస్తాం..

టాప్ 5 బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు:

కాలపరిమితి: 1 సంవత్సరం

బ్యాంకు వడ్డీ రేటు(%) కంపౌండ్ క్వార్టర్లీ రూ. 10,000 పెడితే ఎంత వస్తాయి..?
ఇండస్ ఇండ్ బ్యాంక్ 7.75 10,798
ఆర్బీఎల్ బ్యాంక్ 7.5 10,771
బంధన్ బ్యాంక్ 7.25 10,745
యస్ బ్యాంక్ 7.25 10,745
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 7.1 10,729

కాలపరిమితి: 2 సంవత్సరాలు
ఆర్బీఎల్ బ్యాంక్ 8 11,717
ఇండస్ ఇండ్ బ్యాంక్ 7.75 11,659
డీసీబీ బ్యాంక్ 7.5 11,602
ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ 7.5 11,602
ఐసిఐసిఐ బ్యాంక్ 7.25 11,545

కాలపరిమితి: 3 సంవత్సరాలు

డీసీబీ బ్యాంక్ 7.55 12,516
ఆర్బీఎల్ బ్యాంక్ 7.5 12,497
యస్ బ్యాంక్ 7.25 12,405
ఐడీఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ 7.25 12,405
ఇండస్ ఇండ్ బ్యాంక్ 7.25 12,405

కాలపరిమితి: 5 సంవత్సరాలు
డీసీబీ బ్యాంక్ 7.4 14,428
ధనలక్ష్మి బ్యాంకు 7.25 14,323
ఇండస్ ఇండ్ బ్యాంక్ 7.25 14,323
యస్ బ్యాంక్ 7.25 14,323
ఆర్బీఎల్ బ్యాంక్ 7.1 14,217

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ నెల ప్రారంభంలో తన తాజా ద్రవ్య విధాన సమీక్షలో రెపో రేటును యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. కాని సెంట్రల్ బ్యాంక్ వరుస వడ్డీ రేట్ల కోతలను ప్రారంభించే ముందు ఇది చివరి విరామం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఫలితంగా రాబోయే నెలల్లో బ్యాంక్ ఎఫ్డీ వడ్డీ రేట్లు క్రమంగా తగ్గే అవకాశం ఉంది. గతంలో పెరిగిన వడ్డీ రేట్లతో ఎఫ్డీ ఇన్వెస్టర్లు లాభపడినప్పటికీ, తగ్గుతున్న వడ్డీరేట్ల వాతావరణంలో అదే పెట్టుబడి వ్యూహం ఒకే విధమైన రాబడులను అందించకపోవచ్చు.

మెచ్యూర్ కాబోతున్న అదనపు ఫండ్స్ లేదా ఎఫ్డీలు ఉన్నవారికి, ప్రస్తుత అధిక వడ్డీ రేట్ల వద్ద తమ పెట్టుబడులను సురక్షితంగా ఉంచడానికి ఇది సరైన అవకాశం. ఫిక్స్ డ్ ఇన్ కమ్ ఇన్వెస్టర్లకు అధిక స్థాయిలో రేట్లను లాక్ ఇన్ చేయడానికి ఇదే సరైన తరుణం. యథాతథా స్థితి, క్షీణత మధ్య భవిష్యత్ రేట్లను ఎలా సమతుల్యం చేస్తారో పరిగణనలోకి తీసుకుంటే, ఫ్లోటర్ల కంటే ఫిక్స్ డ్ రేటు ప్రతిపాదనలకు అనుకూలంగా ఉండవచ్చు అని ఫిస్డమ్ హెడ్ రీసెర్చ్ నీరవ్ కర్కేరా సలహా ఇస్తున్నారు.

ప్రారంభ రేటు కోతల వల్ల దీర్ఘకాలిక ఎఫ్డీలు తక్కువగా స్వల్ప, మధ్యకాలిక ఎఫ్డీలపై వడ్డీ రేట్లు తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే భవిష్యత్తులో మీ ఎఫ్డీ మెచ్యూరిటీ అయినప్పుడు మంచి వడ్డీ రేట్లు పొందే అవకాశాలు తక్కువ.