Amazon Diwali Sale: మరో భారీ సేల్ తో రానున్న అమెజాన్.. ఈ సారి టాప్ బ్రాండ్స్ పై 84 పర్సెంట్ ఆఫర్..

అమెజాన్ దీపావళి సేల్‌లో భాగంగా, డిస్కౌంట్ ధరల్లో ప్రీమియం డివైజ్‌లను పొందాలనుకుంటే ఇదే ఉత్తమ సమయం అని అమెజాన్ చెప్తోంది.

Written By: Mahi, Updated On : October 22, 2024 3:20 pm

Amazon Diwali Sale

Follow us on

Amazon Diwali Sale: నిన్నటి వరకు దసరా సేల్ నిర్వహించిన అమెజాన్ ఇప్పుడు దీపావళి సేల్ తో రానుంది. హెడ్‌ఫోన్లు, ఇయర్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లపై అద్భుతమైన డీల్‌ అందిస్తోంది. అమెజాన్ దీపావళి సేల్‌లో భాగంగా, డిస్కౌంట్ ధరల్లో ప్రీమియం డివైజ్‌లను పొందాలనుకుంటే ఇదే ఉత్తమ సమయం అని అమెజాన్ చెప్తోంది. మీరు ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్లు, ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్‌లు లేదా టాప్-ఆఫ్-ది-లైన్ స్మార్ట్‌వాచ్‌ల కోసం సెర్చ్ చేస్తున్నట్లయితే ఈ సేల్ బాగా ఉపయోగపడుతుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి సేల్ లో అనేక బ్రాండ్‌లతో పాటు ప్రముఖ బ్రాండ్‌లైన శామ్‌సాంగ్, సోనీ, యాపిల్ వంటి వాటిపై భారీ తగ్గింపు ఆఫర్లు అందిస్తోంది. దీపావళి సేల్ లో ఇయర్ ఫోన్లతో పాటు స్మార్ట్ వాచ్ లను కూడా అమ్మకానికి ఉంచింది.

వీటితో పాటు న్యూ టెక్నాలజీకి సంబంధించి ఏసీలు, రిఫ్రిజిలేటర్లు, వాషింగ్ మెషిన్లు అన్ని కూడా భారీ ఆఫర్లతో ముందుకు తెచ్చింది. దసరా సేల్ ను ప్రారంభించిన అమెజాన్ దీపావళి సేల్ వరకు దాన్ని పొడిగిస్తూ వచ్చింది. మధ్యలో ఎటువంటి గ్యాప్ లేకుండా కంటిన్యూగా దీపావళి ముగిసే వరకు ఆఫర్లను కొనసాగించనుంది. అయితే రెండింటికీ కలిపి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ పేరుతో తీసుకువచ్చింది.

శామ్‌సాంగ్, సోనీ, ఏసర్, ఎల్‌జీ బ్రాండ్ల టీవీలపై భారీ తగ్గింపు పెట్టింది. సోనీ కంపెనీకి చెందిన బ్రావియా 32 సెం.మీ. టీవీని రూ. 25,990కు అందుబాటులో ఉంచింది. అలాగే వామ్ సాంగ్ రూ. 14,490, ఏసర్ రూ. 12,999, హైయర్ రూ. 12,990, ఎల్‌జీ రూ. 15,990 రేట్లను ప్రకటించింది. అలాగే ఏసీలపై కూడా భారీగానే ప్రకటించింది. బ్లూస్టార్, క్యారియర్, డైకిన్, లల్లాయిడ్ లాంటి వాటిపై దాదాపు రూ. 15 వేల వరకు ఆఫర్లతో అందుబాటులో ఉంచింది.

వాషింగ్ మెషిన్లలో మేటి అయిన బాష్, ఐఎఫ్‌బీ, గోద్రేజ్ లాంటి వాటిపై కూడా మంచి ఆఫర్లను ఇచ్చింది. వీటిపై దాదాపు నాలుగు నుంచి ఆరు వేయిల తగ్గింపు ధరతో అందజేస్తుంది. రిఫ్రిజిరేట్లపై కూడా దసరా సేల్ కంటే దీవాళీ సేవల్ లోనే ఎక్కువగా తగ్గింపు ధరలను పెట్టింది. ఇందులో గోద్రేజ్, హైయర్, ఐఎఫ్‌బీ, ఎల్జీలపై తగ్గింపు ధరలను ఉంచింది.

దసరా ఆఫర్లలో చిన్న చిన్న వస్తువులను తీసుకున్న వినియోగదారులు దీపావళికి పెద్ద పెద్ద వస్తువలను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని కొందరు మార్కెట్ నిపుణులు వివరిస్తున్నారు. దసరా హిందువులకు పెద్ద పండుగ కాబట్టి బట్టల నుంచి తిండి వరకు పెద్ద ఖర్చు ఉంటుంది. దీపావళికి పెద్దగా ఖర్చు ఉండదు కాబట్టి పెద్ద వస్తువులన తీసుకుంటారని తెలుస్తోంది.