Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై ఉత్తరాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు ఐదు రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉండలు ఉన్నాయి. మరి కొన్ని రాశుల వారు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అపరిచిత వ్యక్తులను నమ్మకుండా ఉండాలి. కొందరు మోసం చేసే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎదుటివారు మాట్లాడేటప్పుడు వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారు ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతారు. చట్టపరమైన చెక్కుల్లో పడితే అందులో నుంచి బయటపడతారు. మధురమైన మాటలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. పెట్టుబడులు పెట్టాల్సి వస్తే నిపుణులను సంప్రదించాలి. ఉద్యోగులు కార్యాలయాల్లో తప్పులు చేయడం వల్ల అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. స్నేహితుల్లో ఒకరు ధన సహాయం చేస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారికి ఈ రోజు పూర్వీకుల ఆస్తి గురించి సమాచారం అందుతుంది. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టాలని అనుకునేవారు తమ పనులను వాయిదా వేసుకోవాలి. వ్యాపార పెట్టుబడులు పెట్టేవారు పెద్దల సలహా తీసుకోవాలి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. వివాహంలో అడ్డంకులు ఏర్పడితే నీటితో పరిష్కారం అవుతుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటుంది. వాహనాలు అకస్మాత్తుగా చెడిపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రభుత్వ పథకాలపై శ్రద్ధ చూపుతారు. ఎవరి దగ్గర నుంచి అయినా అప్పుడు తీసుకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. గతంలో చేసిన తప్పులను ఇచ్చి గుణపాఠం నేర్చుకుంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. ఎవరి దగ్గర నుంచి అయినా అప్పు తీసుకుంటే వెంటనే చెల్లించాలి. పిల్లల కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెడతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సొంత వాహనాలపై ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు అనుకోకుండా ధన లాభం ఏర్పడుతుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. కుటుంబ సభ్యుల్లో ఒకరి మాటల ద్వారా ఆందోళన చెందుతారు. విదేశాల్లో ఉండేవారి నుంచి ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. వ్యాపారులకు సాధారణ లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మాటలను అదుపులో ఉంచుకోవాలి. జీవిత భాగస్వామితో ప్రయాణం చేస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు గందరగోల పరిస్థితి ఉంటుంది. కొత్తగా ఏదైనా పనిని ప్రారంభిస్తే జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలి. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. సోదరుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. పిల్లలనుంచి శుభవార్తలు వింటారు. పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు దూరపు ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులు మానసికంగా భారమును ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల ఎవరికైనా ఆరోగ్యం ఇస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. స్నేహితుల్లో ఒకరి గురించి అందరిని చెందుతారు. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. ఉద్యోగులు అనుకోకుండా శుభకార్యాక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పనిని ప్రారంభించేముందు నిపుణుల సలహా తీసుకోవాలి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఇతరుల వద్ద ఏదైనా రుణం తీసుకోవాలని అనుకుంటే కాస్త ఆలోచించాలి. మార్కెట్లో కొత్త పెట్టుబడులు పెడతారు. ఇందులో లాభాలు బాగా వస్తాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . మకర రాశి వ్యాపారులకు ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉండలు ఉన్నాయి. కొన్ని రిస్కుతో కూడిన పనులను చేస్తారు. విద్యార్థులు పరిశోధనలో పాల్గొంటారు. పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు అరుదైన గౌరవం లభిస్తుంది. అయితే కొన్ని సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరించాలి. అనవసరంగా కోపం తెచ్చుకోవడం వల్ల మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొందరు ప్రత్యర్థులు ఇబ్బందులు పెట్టాలని చూస్తారు. అలాంటి వారి నుంచి జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వ్యాపారంలో ఈరోజు మార్పులు చేయాలని అనుకుంటే ఇదే మంచి సమయం. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి అన్వైన రోజు. ఈరోజు వీరి మనసు ఉల్లాసంగా ఉంటుంది. విద్యా రంగంపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.