https://oktelugu.com/

ఫేస్ బుక్ సంచలన నిర్ణయం.. వారికి భారీ షాక్..?

ఫేస్ బుక్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాజకీయ సంబంధిత గ్రూపులను ఇకపై రికమెండ్ చేయబోమని కీలక ప్రకటన చేసింది. ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ ఫేస్ బుక్ కు సంబంధించి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ చర్యలు ఇప్పటికే అమెరికాలో అమలవుతుండగా ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలని ఫేస్ బుక్ భావిస్తూ ఉండటం గమనార్హం. ఫేస్ బుక్ లో పొలిటికల్ గ్రూపులకు సంబంధించిన పోస్టుల వల్ల ఫేస్‌బుక్ పరపతి క్షీణించింది. Also Read: మ్యూచువల్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 29, 2021 / 12:40 PM IST
    Follow us on

    ఫేస్ బుక్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాజకీయ సంబంధిత గ్రూపులను ఇకపై రికమెండ్ చేయబోమని కీలక ప్రకటన చేసింది. ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ ఫేస్ బుక్ కు సంబంధించి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ చర్యలు ఇప్పటికే అమెరికాలో అమలవుతుండగా ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలని ఫేస్ బుక్ భావిస్తూ ఉండటం గమనార్హం. ఫేస్ బుక్ లో పొలిటికల్ గ్రూపులకు సంబంధించిన పోస్టుల వల్ల ఫేస్‌బుక్ పరపతి క్షీణించింది.

    Also Read: మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారా.. చేయకూడని తప్పులివే..?

    దీంతో ఇకపై ఫేస్ బుక్ న్యూస్ ఫీడ్ నుంచి పొలిటికల్ కంటెంట్ ను వీలైనంత తగ్గించాలని భావిస్తోంది. జుకర్ బర్గ్ ఫేస్ బుక్ యూజర్ల ఫీడ్ బ్యాక్ ను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సివిక్, పొలిటికల్ గ్రూపులను రికమెండేషన్ల జాబితా నుంచి తొలగిస్తున్నామని పేర్కొన్నారు. మళ్లీ పూర్వ వైభవం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఫేస్ బుక్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఫేస్ బుక్ తీసుకున్న ఈ నిర్ణయం పొలిటికల్ పార్టీలకు షాక్ అనే చెప్పాలి.

    Also Read: ఆధార్, ఓటీపీ వివరాలు చెప్పొద్దంటున్న కేంద్రం.. ఎందుకంటే..?

    కొన్ని నెలల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల సమయంలో ఫేస్ బుక్ ద్వారా ప్రజలకు తప్పుదారి పట్టించే సందేశాలు, హింసాత్మక సందేశాలకు సంబంధించిన ప్రచారం జరగకుండా ఫేస్ బుక్ కీలక చర్యలు తీసుకుంది. అమెరికాలో ఫేస్ బుక్ తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడంతో మిగతా దేశాల్లో కూడా ఇదే తరహా నిర్ణయాలను అమలు చేయాలని ఫేస్ బుక్ భావిస్తోంది.

    మరిన్ని వార్తలు కోసం: వ్యాపారము

    ఈ క్రమంలోనే అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఖాతాలు కూడా సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. ట్రంప్ ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ ఖాతాలకు సంబంధించి ఫేస్ బుక్ నిపుణులతో సంప్రదించి ఖాతాల సస్పెన్షన్ ను కొనసాగించాలో వద్దో నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.