https://oktelugu.com/

మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారా.. చేయకూడని తప్పులివే..?

మనలో చాలామంది డబ్బులను పొదుపు చేయాలని భావిస్తూ ఉంటారు. పొదుపు చేయడం కోసం ఉన్న ఆప్షన్లలో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒకటి. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కళ్లు చెదిరే లాభాలను పొందవచ్చు. గతేడాది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్లకు ఊహించని స్థాయిలో లాభాలు వచ్చాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్ లో లాభాలు ఏ స్థాయిలో ఉంటాయో నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. Also Read: ఫేస్ బుక్ సంచలన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 29, 2021 / 12:19 PM IST
    Follow us on

    మనలో చాలామంది డబ్బులను పొదుపు చేయాలని భావిస్తూ ఉంటారు. పొదుపు చేయడం కోసం ఉన్న ఆప్షన్లలో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒకటి. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కళ్లు చెదిరే లాభాలను పొందవచ్చు. గతేడాది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్లకు ఊహించని స్థాయిలో లాభాలు వచ్చాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్ లో లాభాలు ఏ స్థాయిలో ఉంటాయో నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి.

    Also Read: ఫేస్ బుక్ సంచలన నిర్ణయం.. వారికి భారీ షాక్..?

    అయితే కొన్ని తప్పులు చేయకుండా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెడితే మాత్రం నష్టపోకుండా లాభాలను పొందే అవకాశం ఉంటుంది. గతేడాది చివరినాటికి మ్యూచువల్ ఫండ్స్ ఏయూఎం 30 లక్షల కోట్ల రూపాయలకు చేరడం గమనార్హం. 2019 సంవత్సరం చివరితో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్ ఏయూఎం ఏకంగా 13 శాతం పెరగడం గమనార్హం. దీర్హకాలం ఇన్వెస్ట్ చేసేవాళ్లకు మ్యూచువల్ ఫండ్స్ ప్రయోజనకరంగా ఉంటాయి.

    Also Read: ఆధార్, ఓటీపీ వివరాలు చెప్పొద్దంటున్న కేంద్రం.. ఎందుకంటే..?

    మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు మొదట మ్యూచువల్ ఫండ్స్ గురించి సరైన అవగాహనను ఏర్పరచుకోవాలి. ఇతరుల సలహాలు విని అనాలసిస్ చేయకుండా ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసేవాళ్లు ఫైనాన్షియల్ అడ్వైజర్ సహాయంతో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. ట్యాక్స్ చెల్లించేవాళ్లు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ప్రయోజనం పొందవచ్చు.

    మరిన్ని వార్తలు కోసం: వ్యాపారము

    ఒకే తరహా ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయకుండా వేర్వేరు ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. స్వల్ప కాలంలోనే లాభాలు పొందాలని భావిస్తే మాత్రం మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అలా లాభాలను పొందడం సాధ్యం కాదని గుర్తుంచుకోవాలి. దీర్ఘకాలంలో లాభాలను పొందాలని భావించే వారికి మాత్రం మ్యూచువల్ ఫండ్స్ ఉత్తమమని చెప్పవచ్చు.