Homeబిజినెస్Hero : పెట్రోల్ ఖర్చులకు భయపడాల్సిన పనిలేదు! హీరో తీసుకొచ్చింది సూపర్ మైలేజ్ బైక్!

Hero : పెట్రోల్ ఖర్చులకు భయపడాల్సిన పనిలేదు! హీరో తీసుకొచ్చింది సూపర్ మైలేజ్ బైక్!

Hero : ఆఫీస్‌కు వెళ్లడానికి మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలని చూస్తున్నారా? అయితే ఈ వార్త పూర్తిగా చదవండి. ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 700 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఒక అద్భుతమైన బైక్‌ గురించి వివరంగా తెలుసుకుందాం. అధిక మైలేజ్ ఇచ్చే ఈ బైక్ హీరో మోటోకార్ప్ కంపెనీకి చెందినది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో Hero Splendor Plus XTEC 2.0 మోడల్ అందుబాటులో ఉంది. ఈ బైక్ మెరుగైన మైలేజ్‌ ఇవ్వడమే కాకుండా అనేక అద్భుతమైన ఫీచర్లను కూడా అందిస్తుంది.

Also Read : రికార్డు విక్రయాల ఆనందంలో బజాజ్.. పల్సర్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లు!

Hero Splendor Plus XTEC 2.0 ధర ఎంత?
హీరో మోటోకార్ప్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. ఈ బైక్ ధర ఢిల్లీలో రూ. 83,571 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఆర్టీఓ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ , ఇతర ఛార్జీలు కలుపుకుంటే వివిధ రాష్ట్రాల్లో ఈ బైక్ ఆన్-రోడ్ ధర మారుతుంది.

Hero Splendor Plus మైలేజ్ ఎంత?
హీరో కంపెనీ ఈ బైక్‌లో 9.8 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌ను అందించింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం..ఈ బైక్ ఒక లీటర్ పెట్రోల్‌తో 73 కిలోమీటర్ల (ARAI పరీక్షించిన ప్రకారం) మైలేజ్ ఇస్తుంది. అంటే, 9.8 లీటర్ల ఫుల్ ట్యాంక్‌తో ఈ బైక్ ఏకంగా 715.4 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అయితే, రహదారి పరిస్థితులు, రైడింగ్ శైలిపై ఆధారపడి మైలేజీ మారుతుంది.

Hero Motorcycle ప్రత్యేకతలు:
ఈ బైక్‌లో కంపెనీ డిజిటల్ మీటర్, ఎకో ఇండికేటర్, హజార్డ్ లైట్, రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, బ్లూటూత్ కనెక్టివిటీ విత్ కాల్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్ వంటి ప్రత్యేక ఫీచర్లను అందింస్తుంది ఇంజన్ విషయానికి వస్తే…ఈ మోటార్‌సైకిల్‌లో 97.2 సీసీ 4 స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను అమర్చారు. బ్రేకింగ్ కోసం ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఇచ్చారు.

Also Read  : ఎలక్ట్రిక్ 2-వీలర్ సెగ్మెంట్‌లో ఓలాదే రాజ్యం..ఒకేసారి 6 కొత్త మోడళ్లు విడుదల!

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular