https://oktelugu.com/

Megastar Chiranjeevi: షాకింగ్ : మెగాస్టార్ కి కరోనా పాజిటివ్ !

Megastar Chiranjeevi: మెగా అభిమానులకు బ్యాడ్ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా బారిన పడ్డారు. తనకు కోవిడ్ -19 పాజిటివ్ అని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం చిరంజీవి ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రస్తుతం చిరు కరోనాకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిరంజీవి కరోనా విషయంలో మొదటి నుంచి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఎంతో జాగ్రత్తగా ఉన్నా.. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా.. ఇలా ప్రముఖులకు కూడా కరోనా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 26, 2022 / 10:26 AM IST
    Follow us on

    Megastar Chiranjeevi: మెగా అభిమానులకు బ్యాడ్ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా బారిన పడ్డారు. తనకు కోవిడ్ -19 పాజిటివ్ అని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం చిరంజీవి ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రస్తుతం చిరు కరోనాకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిరంజీవి కరోనా విషయంలో మొదటి నుంచి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

    Megastar Chiranjeevi

    ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఎంతో జాగ్రత్తగా ఉన్నా.. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా.. ఇలా ప్రముఖులకు కూడా కరోనా పాజిటివ్ రావడం షాకింగ్ విషయమే. ఇక ప్రస్తుతం మెగాస్టార్ కి తేలికపాటి జ్వరంతో పాటు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయట.

    ప్రస్తుతానికి వైద్యుల సూచన మేరకు ఆయన ఇంట్లోనే ఐసోలేట్ అయ్యారు. ప్రస్తుతం మెగాస్టార్ ఖాతాలో భారీ క్రేజీ ప్రాజెక్ట్‌ లు ఉన్నాయి. అందుకే
    చిరుకి కరోనా పాజిటివ్ అని తెలియగానే ఆయా సినిమాల మేకర్స్ టెన్షన్ పడుతున్నారు.

    Also Read: బక్కగా ఉన్నారా.. బలంగా మారాలంటే తినాల్సిన ఆహార పదార్థాలివే?

    అసలు కరోనా మూడో వేవ్ ఇంత వేగంగా వ్యాప్తి చెందుతుందని ఎవ్వరూ ఊహించలేదు. వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా నటీనటులకు వరుసగా కరోనా పాజిటివ్ వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. క‌రోనా వైర‌స్ బారిన ప‌డుతున్న సెల‌బ్రిటీల జాబితా కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.

    Megastar Chiranjeevi

    ఏది ఏమైనా మెగాస్టార్ చిరంజీవి పట్ల ఎనలేని ప్రేమాభిమానాలు ఉన్న ఫ్యాన్స్ మాత్రం ఈ విషయం తెలియగానే బాధ పడుతున్నారు. ఇలా కేసులు ఎక్కువైతే సడెన్ గా షూటింగ్స్ కూడా ఆపుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే, చాలా సినిమాలు మధ్యలోనే షెడ్యూల్స్ ను క్యాన్సిల్ చేసుకున్నాయి.

    Also Read:  రాజమౌళి సినిమాల్లో కామన్ గా కనిపించే ఈ పాయింట్స్ ఎప్పుడైనా గమనించారా ?

    Tags