Homeబిజినెస్తక్కువ ఖర్చుతో నెలకు రూ.40 వేలు సంపాదించే ఛాన్స్.. ఎలా అంటే?

తక్కువ ఖర్చుతో నెలకు రూ.40 వేలు సంపాదించే ఛాన్స్.. ఎలా అంటే?

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ వల్ల లక్షల సంఖ్యలో ప్రజలు ఉద్యోగాలను కోల్పోయారు. కరోనా విజృంభణ వల్ల వ్యాపారాలపై కూడా ప్రతికూల ప్రభావం పడటం గమనార్హం. ఇలాంటి సమయంలో తక్కువ మొత్తం ఖర్చుతో సులభంగా డబ్బులను సంపాదించే అవకాశం ఉంది. ఐఆర్‌సీటీసీ ఏజెంట్‌ గా పని చేయడం ద్వారా సులభంగా తక్కువ సమయంలోనే డబ్బును సంపాదించే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.

ఐఆర్‌సీటీసీ ఏజెంట్‌గా పని చేయడం వల్ల నెలకు ఏకంగా 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు ట్రైన్ టికెట్స్ బుకింగ్ ద్వారా ఆదాయం పొందవచ్చు. కమీషన్ రూపంలో ఈ ఆదాయాన్ని పొందే అవకాశం ఉండగా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. అయితే రైల్ ట్రావెల్ సర్వీస్ ఏజెంట్‌ గా పని చేయడానికి అందరూ అర్హులు కాదు. కనీసం ఇంటర్ చదివిన వాళ్లు మాత్రమే ఐఆర్‌సీటీసీ ఏజెంట్‌గా పని చేయవచ్చు.

ఐఆర్‌సీటీసీ ఏజెంట్‌గా చేరాలంటే ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏజెంట్ గా దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్, పాన్ కార్డ్ తో పాటు ఈమెయిల్, మొబైల్ నంబర్, అడ్రస్, ఇతర వివరాలను అందజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 30,000 రూపాయలతో ఐఆర్‌సీటీసీ పేరుపై డీడీ తియ్యాలి. డీడీ తీసిన మొత్తంలో 20,000 రూపాయలు వెనక్కు వస్తాయని సమాచారం.

ఐఆర్‌సీటీసీతో అగ్రిమెంట్ ను పూర్తి చేసిన తరువాత 20,000 రూపాయలు వెనక్కు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆ తరువాత సంవత్సరానికి 5,000 రూపాయల చొప్పున ఐఆర్‌సీటీసీకి రెన్యువల్ ఫీజును చెలించాల్సి ఉంటుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...
Oktelugu Epaper
Exit mobile version